Published On:

Putin: ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్.. కీలక విషయాలపై చర్చ

Putin: ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్.. కీలక విషయాలపై చర్చ

Phone Call: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి కాల్ చేశారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిపై ఇరుదేశాధినేతలు చర్చించారు. కాగా పహల్గామ్ దాడి ఘటనను పుతిన్ ఖండించారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో భారత్ కు రష్యా అండగా ఉంటుందని తెలిపారు.

పహల్గామ్ దాడిలో చనిపోయిన వారికి తీవ్ర సంతాపం ప్రకటించారు. దారుణమైన ఘటనకు పాల్పడిన వారిని, వారికి సాయం చేసినవారిని కఠినంగా శిక్షించాలని పుతిన్ అన్నట్టు సమాచారం. మరోవైపు భారత్- రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంటామని చెప్పారు.

కాగా రష్యాలో నిర్వహిస్తున్న విక్టరీ డే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావల్సి ఉంది. కానీ పహల్గాం దాడి, దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై రష్యా విజయం సాధించిన సందర్భంగా విక్టరీ డే వేడుకలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో పలు దేశాల అధినేతలను ఆహ్వానిస్తుంది. అందుకే విక్టరీ డే సంద్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు శుభాకాంక్షలు తెలిపారు.