Published On:

Break for Operation Kagar: ఆపరేషన్ కగార్‌కు తాత్కాలిక బ్రేక్.. సరిహద్దులకు బలగాలు!

Break for Operation Kagar: ఆపరేషన్ కగార్‌కు తాత్కాలిక బ్రేక్.. సరిహద్దులకు బలగాలు!

Operation Kagar is on Hold amid Operation Sindoor: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ‘ఆపరేషన్ కగార్‌’ చేపట్టింది. ఈ క్రమంలోనే కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆపరేషన్ కగార్‌పై ‘ఆపరేషన్ సిందూర్‘ ఎఫెక్ట్ పడింది. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మావోల ఏరివేతకు కర్రెగుట్టను జల్లెడ పడుతున్న సీఆర్పీఎఫ్‌ బలగాలు వెనక్కి రావాలని కేంద్రం ఆదేశించింది. దీంతో కర్రెగుట్టల్లో మావోల వేటకు బ్రేక్ పడింది. దాదాపు 5 వేల మందికిపైగా బలగాలను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. కర్రెగుట్ట నుంచి బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సీఆర్‌పీఎఫ్ కోబ్రా జవాన్లను తమ హెడ్ క్వార్ట‌ర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కేంద్ర బలగాలు వెనుతిరుగుతున్నాయి.

 

కేంద్రం ఆదేశాల మేరకు..

ములుగు జిల్లాలోని వెంకటాపురం, ఆలూబాక, వీరభద్రవరం పెద్దగుట్ట పరిసరాల్లో బలగాలు మోహరించగా, ఈ సందర్భంగా బలగాలకు బ్రేక్ ఇచ్చారు. కేంద్రం ఆదేశాల మేరకు ఆదివారం ఉదయంలోగా భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు బలగాలు వెళ్లనున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోలు లేకుండా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్‌ దూకుడుగా సాగుతోంది. ఆపరేషన్‌ కగార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారీగా మావోలు మృతిచెందారు. మృతిచెందిన వారిలో పలువురు అగ్రనేతలు ఉన్నారు. కొద్దిరోజులుగా ఆపరేషన్ కర్రెగుట్టలు పేరుతో మావోల ఏరివేతకు భద్రతా బలగాలు కర్రెగుట్టలపై సెర్చ్‌ కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు ఆగ్రనేతలే లక్ష్యంగా ఆపరేషన్‌ కర్రెగుట్టల్లో పెద్దఎత్తున కూబింగ్ కొనసాగిస్తున్నారు. 145 ఎకరాల విస్తీర్ణం ఉన్న కర్రెగుట్ట చుట్టూ 10వేల మంది భద్రతా బలగాలు మోహరించాయి.

 

కర్రెగుట్టల్లో బంకర్లను ఏర్పాటు ..

కర్రెగుట్టల్లో బంకర్లను ఏర్పాటు చేసుకుని మావోలు ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు జల్లడపడుతున్నాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న కూంబింగ్‌లో పలువురు మావోలు తారసపడటంతో ఎన్‌కౌంటర్లు జరిగాయి. చాలామంది మావోలు మృతిచెందారు. మావోలు అమర్చిన మందుపాతర పేలి నలుగురు గ్రౌహౌండ్స్ కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మావోల కోసం మరింతగా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో బలగాలను వెనక్కి రావాలని కేంద్రం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ బలగాను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. దీంతో సరిహద్దులకు వెళ్లేందుకు భద్రతా బలగాలు కర్రెగుట్టలను వీడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి: