Pahalgam terror Attack : భారత్ ప్రయోజనాలను కాపాడేందుకు సిద్ధం : ప్రకటించిన ఇండియన్ నేవీ

Pahalgam terror Attack : పహల్గాంలో పర్యాటకుపై జగిరిన ఉగ్రదాడిలో 26 మంది దుర్మరణం చెందగా, మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ నౌకాదళం సిద్ధమైంది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. పహల్గాంలో ఉగ్రదాడితో భారత్-పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తన సన్నద్ధతను చాటేందుకు ఇండియన్ నేవీ తాజా పరీక్షలు నిర్వహించింది.
మూడు రోజుల క్రితం..
సముద్రజలాల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా ఇండియా ప్రయోజనాలను కాపాడేందుకు తాము సిద్ధమని ఇండియన్ నేవీ ప్రకటించింది. 3 రోజుల క్రితం ఇండియా ఆరేబియా సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్‌తో సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ అయిన ఐఎన్‌ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.
విషయాన్ని ఇండియన్ నేవీ సోషల్ మీడియాలో తెలిపింది. సీ స్కిమ్మింగ్ లక్ష్యాన్ని కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతితక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు లాంటి వాటిని సీ స్కిమ్మింగ్ లక్ష్యాలుగా పేర్కొంటారు.