Happy Earth Day 2025 : ప్రతి ఏట ధరిత్రి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Happy Earth Day 2025 : జీవరాశి మనుగడకు పట్టుకోమ్మ భూమి, మనిషికి జీవనాధారం. ప్రకృతి పురుడుపోసుకుందే ఈ భూమిపైన. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ధరిత్రి దినోత్సవంగా జరుపుకుంటారు. మానవాళితో పాటు జంతువులు ప్రాణాలతో ఉండాలంటే భూమి పచ్చగా ఉండటం చాలా అవసరం. అందుకుగాను భూమి యొక్క విలువను తెలియపరచడానికి, పర్యావరణంపై అవగాహన కలగటానికి వరల్డ్ ఎర్త్ డే ఎంతగానో ఉపయోగపడుతుంది. ‘మన భూమి మన శక్తి’ ( OUR POWER, OUR PLANET ) అనే స్లోగన్ తో ప్రపంచ వ్యాప్తంగా చైతన్యం తీసుకువచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.
వరల్డ్ ఎర్త్ డే ను మొట్టమొదటగా 1970లో అమెరికాలో జరుపుకున్నారు. ప్రస్తుతం 197దేశాలలో ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీలు వదిలే కలుషితాలు భూమికి భారమవుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. దీంతో పాటే వాతావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి వాటిని ఆపడానికి, లేక తట్టుకుని నిలబడడానికి అవగాహనా దినోత్సవం ఎంతగానో అవసరమని చెబుతున్నారు. మానవాళి ఎప్పుడైతే ఈకో ప్రెండ్లీ వైపు మొగ్గుచూపుతారో అప్పుడే భూమికి రక్షణ లభిస్తుందని శాస్తవేత్తలు తెలిపారు.
రానున్న రోజుల్లో జీవజాలం మనుగడ సాగించాలంటే భూమిని కాలుష్యపు కోరల్లోంచి రక్షించుకోవాలి. అందుకుగాను పచ్చదనాన్ని పరిరక్షించుకోవాలని నిపుణులు తెలిపారు. భూమి మానుషులతో పాలు ఎన్నో జీవులకు ఇల్లులాంటిదని దాని రక్షణే మన రక్షణ అని చెప్పారు. ఇప్పటికే అడవులు నశించి భూతాపం పెరిగిందని గుర్తుచేశారు. ఎండ తీవ్రత ప్రతీ సంవత్సరం పెరుగుతుండటం భూమిని రక్షించుకోలేక పోవడాని ఉదాహరణగా చెప్పారు. కావున ప్రజలు అప్రమత్తమై భూమి కాపాడుకోవాలని నొక్కివక్కానిస్తున్నారు.
ప్రముఖుల మాటల్లో వరల్డ్ ఎర్త్ డే :
“భూమి ప్రతి మనిషి అవసరాలను తీర్చడానికి తగినంత సహకరిస్తుంది, దురాశను కాదు” – మహాత్మా గాంధీ
“చెట్లు నాటినవాడు తనను కాకుండా ఇతరులను ప్రేమిస్తాడు”— థామస్ ఫుల్లర్
“ప్రకృతిని లోతుగా చూడండి, అప్పుడు మీరు ప్రతీ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు.”— ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
‘వ్యర్థాలను చూసినప్పుడు నాకు కోపం వస్తుంది. మనం ఉపయోగించగల వస్తువులను కూడా కొందరు కావాలనే చెత్తగా మారుస్తున్నారు.” — మదర్ థెరిసా