Last Updated:

Karnataka: టిప్పు సుల్తాన్ ప్రారంభించిన ‘సలామ్ ఆరతి’ పేరు మార్చిన కర్ణాటక సర్కార్

కర్ణాటకలోని మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ప్రారంభించిన ‘సలామ్ ఆరతి’ ఆచారం పేరు మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

Karnataka: టిప్పు సుల్తాన్ ప్రారంభించిన ‘సలామ్ ఆరతి’ పేరు మార్చిన కర్ణాటక సర్కార్

Karnataka: కర్ణాటకలోని మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ప్రారంభించిన ‘సలామ్ ఆరతి’ ఆచారం పేరు మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.హిందూ ధార్మిక సంస్థలు మరియు ధర్మాదాయ శాఖ పరిధిలోకి వచ్చే కర్ణాటక ధార్మిక పరిషత్ అనాదిగా వస్తున్న ఈ కార్యక్రమం పేరును నమస్కార అని పేరు పెట్టింది.

మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ కాలంలో ‘సలామ్ ఆరతి’ ఆచారం ప్రారంభమైంది. మైసూరు రాజ్య సంక్షేమం కోసం టిప్పు పూజలు చేశాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఆయన మరణించిన తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా వివిధ హిందూ దేవాలయాల్లో ఆచారం కొనసాగుతోంది..అప్పటి మైసూరు రాజ్యంలోని పుత్తూరు, సుబ్రమణ్య, కొల్లూరు, మేల్కోటే మొదలైన ప్రసిద్ధ దేవాలయాలలో ఈ ఆచారం జరిగింది.

హిందూ సంస్థల ప్రకారం, ‘సలామ్ ఆరతి’ బానిసత్వానికి చిహ్నం కాబట్టి ఈ పేరును మార్చినట్లు చెప్పబడింది. అయితే ఈ సంప్రదాయం హిందువులు మరియు ముస్లింల మధ్య బంధాన్ని మరియు సామరస్యాన్ని ప్రతిబింబిస్తుందని మరియు దానిని గొప్ప సంప్రదాయంగా కొనసాగించాలని మేధావులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: