Published On:

Ex DGP murder case: కర్ణాటక మాజీ డీజీపీ హత్య.. భార్యే కారం పొడి చల్లి.. వెలుగులోకి సంచలన విషయాలు

Ex DGP murder case: కర్ణాటక మాజీ డీజీపీ హత్య.. భార్యే కారం పొడి చల్లి.. వెలుగులోకి సంచలన విషయాలు

Karnataska Ex DGP murder case Issue: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆయనను కత్తితో పొడిచి చంపే ముందు ఆయన కళ్లల్లో కారం పొడి చల్లింది. ఆ తర్వాత పొడిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే మాజీ డీజీపీని తన భార్య చంపిన తర్వాత తానే స్వయంగా మరో పోలీసు అధికారి భార్యకు ఫోన్ చేసి తన భర్తను చంపినట్లు చెప్పింది. దీంతో ఈ కేసులో మాజీ డీజీపీ భార్య పల్లవి ప్రధాన నిందితురాలిగా తేలడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

అంతకుముందు, భార్యాభర్తల మధ్య ఓ ఆస్తి విషయంపై గొడవ జరిగింది. ఈ ఘర్షణ పెద్దగా కావడంతో ఆయన భార్య ప్రకాశ్ ముఖంపై కారం పొడి చల్లింది. ఆ తర్వాత మంట నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తుండగా.. పల్లవి దారుణంగా కత్తితో పలుమార్లు పొడిచింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందగా.. వెంటనే ఆమె ప్నేహితురాలికి ఫోన్ చేసి రాక్షసుడిని నేనే చంపాన్ అని వీడియో కాల్ చేసినట్లు విచారణలో తేలింది.

 

అయితే గత కొంతకాలంగా మాజీ డీజీపీకి ఆయన భార్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు విచారణలో తేలింది. ఇందులో కర్ణాటకలోని దండేలిలో ఓ భూమికి సంబంధించి తన బంధువుకు బదిలీ చేశారనే విషయంపై గొడవ జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ హత్య కేసులో మాజీ డీజీపీ కుమార్తె ప్రమేయం ఉందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

 

ఇటీవల పల్లవి సైతం హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. సిబ్బంది అంగీకరించలేదు. దీంతో ఆమె పీఎస్ ఎదుట ధర్నాకు దిగారు. కాగా, పల్లవి స్కిజోఫ్రెనియాతో బాధపడుతుందని, చికిత్స కూడా తీసుకుంటున్నట్లు కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎప్పుడూ తన భర్త విషయంలో టెన్షన్ పడుతోందని, ఎక్కువగా ఆలోచనలతో ఆందోళనకు గురైందని తెలిపారు.

 

కాగా, ఈ హత్య కేసులో రక్తపు మడుగులో ఇంట్లో శవమై మాజీ డీజీపీ కనిపించారు. భార్య హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్తి వివాదాలు కుటుంబ తగాదాలతోనే హత్య జరిగినట్లు పోలీసులు తెలుపుతున్నారు. కుమారుడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల అదుపులో భార్య పల్లవి, కుమార్తె, కోడళ్లు ఉన్నారు.