Home / Karnataka
కర్ఱాటకలోని ప్రైవేట్ పరిశ్రమలలో సి మరియు డి గ్రేడ్ పోస్టులకు కన్నడిగులు లేదా స్థానిక నివాసితులకు 100 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తూ కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. అయితే, సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరిశ్రమ దిగ్గజాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో దానిని తొలగించారు
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌కు అవకాశాం ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వొక్కలిగ మఠం పీఠాదిపతి చంద్రశేఖర స్వామిజీ అభ్యర్థించారు. ఒక కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్యతో వేదిక పంచుకున్న సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు
కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్ ధర లీటరుకు రూ.3 పెంచింది. సవరించిన రేట్లు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్‌పై అమ్మకం పన్ను 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం పెంచింది.
శాండిల్‌వుడ్ టాప్ హీరో దర్శన్ తూగుదీప, ఆయన భార్యపవిత్ర గౌడను ఓ హత్య కేసులో పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా దర్శన్ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తిని హత్య చేయడంలో కీలకపాత్ర వహించాడని పోలీసులు మంగళవారం చెప్పారు.
హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన బిల్డర్ కుప్పాల మధు (48) కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 24న చింతల్ లో అదశ్యమయిన మధు బీదర్ లో హత్యకు గురయ్యారు. మధు దగ్గర ఉన్న ఐదు లక్షల రూపాయల నగదు, విలువైన అభరణాలు మాయం అయినట్లు సమాచారం.
కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ర్ట బీజేపీ నాయకుడు జీ దేవరాజ్ గౌడను శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీస వాహనంలో తరలిస్తుండగా కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు.
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణం గురించి యావత్ దేశం చర్చించుకుంటోంది. లోకసభ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజ్వల్ శనివారం ఉదయం ఫ్రాంక్ఫర్ట్వెళ్లి పోయారు. ఆదివారం నాడు ప్రజ్వల్ కు చెందిన సుమారు 3వేల వీడియోలు కర్ణాటకలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రేవన్న మాత్రం తన కుమారుడిని వెనకేసుకు వస్తున్నారు
కర్ణాటకలో ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ దుమారం చెలరేగుతోంది. దీనికంతటికి కారణం మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవగౌడ్ మనవడు ప్రజ్వల్ రెవన్న సెక్స్ స్కాండిల్‌లో కూరుకుపోవడమే. ప్రజ్వల్ అసభ్యకరమైన క్లిప్స్ ప్రస్తుతం కర్నాటకలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో పాటు ఓ మహిళ కూడా జెడి ఎస్ నాయకుడు ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రెవన్న తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసు ఫిర్యాదు చేశారు
జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్యం (ఆర్ సి హెచ్ ) పోర్టల్ కర్ణాటకలో కేవలం 11 నెలల్లో 28,657 మంది మైనర్ బాలికలు గర్బం దాల్చారని పేర్కొంది. వీరిలో 558 మంది గర్భిణీ బాలికలు 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు కావడం విశేషం. గత ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు సగటున 2,600 కేసులు నమోదయ్యాయని తెలిపింది.
కేంద్రం నుంచి కరువు నిధులు అడిగేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య , రాష్ట్ర మంత్రి జమీర్ అమ్మద్ ఖాన్ 'ప్రైవేట్ జెట్'లో ఢిల్లీ వెళ్లడం ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ మధ్య ఆసక్తికరమైన మాటల యుద్ధానికి దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ షేర్ చేస్తూ.. విమర్శలు గుప్పించగా, మీరు మాత్రం చేస్తున్నదేమిటంటూ కాంగ్రెస్ ఎదురు ప్రశ్నించింది.