Mann Ki Baat: కాశ్మీర్ అభివృద్ధిని తీవ్రవాదులు నాశనం చేశారు

Mann Ki Baat: ఉగ్రవాదులు కాశ్మీర్ పురోగతిని నాశనం చేశారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ‘మన్ కి బాత్’ లో మాట్లడిన ఆయన, ఇటీవలి కాలంలో కాశ్మీర్ అద్భుతమైన పురోగతిని చూసిందన్నారు. పర్యాటకం, పాఠశాలలు, కాలేజీలు పెరిగాయన్నారు. కాశ్మీర్ డెవలప్ అవుతుంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారు నిరాశచెందుకున్నారని అన్నారు.
”కాశ్మీర్ లో శాంతి తిరిగి పుంజుకుంటున్న క్రమంలో పాఠశాలలు, కళాశాలల్లో ఉత్సాహం వచ్చింది. ప్రజాస్వామ్యం బలపడింది. పర్యాటకం పెరిగింది. యువతకు కొత్త ఉపాది అవకాశాలు వచ్చాయి. ఇవన్నీ ఉగ్రవాదులకు ఇష్టం లేదు. వారిని వెనకుండి నడిపించే దేశానికి ఇష్టం లేదు” అనిప్రధాని మోదీ అన్నారు.
“ప్రపంచ దేశాదినేతలు నాకు ఫోన్ చేశారు. పహల్గాం దాడిని ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచం భారత్ కు తోడుంది. దాడిలో మరణించినవారి కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఈ సంఘటన వెనక ఉన్న ఉగ్రవాదులు, కుట్రదారులకు వారి ఊహకు అందని శిక్ష పడుతుంది. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకుంటాము” అని మోదీ తెలిపారు.
దాడి జరిగిన తర్వాత మొదటి సారి బీహార్ గడ్డపైనుంచి మాట్లాడిన ఆయన, తీవ్రవాదులు భూమిపై ఎక్కడదాక్కున్నా బయటకులాగి కొడతామన్నారు. భూమి చివరి వరకు వెంబడిస్తామన్నారు. ఉగ్రవాదం భారతదేశ స్తూర్తిని ఎప్పటికీ విచ్చిన్నం చేయలేదన్నారు. ఇప్పటికే పాకిస్థాన్ పై దౌత్యపరమైన చర్యలు తీసుకున్నారు.