Published On:

Upendra: ఉపేంద్రకు అనారోగ్యం.. ఇదిగో క్లారిటీ

Upendra: ఉపేంద్రకు అనారోగ్యం.. ఇదిగో క్లారిటీ

Upendra: కన్నడ నటుడు ఉపేంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే యూఐ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉపేంద్ర.. రామ్ హీరోగా నటిస్తున్న RAPO22 లో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

 

ఇక గత కొన్నిరోజులుగా ఉపేంద్ర ఆరోగ్యంపై రూమర్స్ వస్తున్నాయి. ఆయన హెల్త్ బాలేదని, హాస్పిటల్ లో చేర్పించారని టాక్ వచ్చింది. అంతేకాకుండా యూఐ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు తీవ్ర అనారోగ్యం వలన బరువు తగ్గాడని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఉపేంద్ర ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా ఈ వార్తలపై ఉపేంద్ర స్పందించాడు.

 

తాజాగా  ఉపేంద్ర మాట్లాడుతూ.. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అన్ని అసత్యం అని తెలిపాడు. ” నేను ఆరోగ్యంగానే ఉన్నాను. హాస్పిటల్ కి రెగ్యులర్ చెకప్ కు వెళ్లాను. రూమర్స్ ను నమ్మకండి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో  ఫ్యాన్స్ కొద్దిగా తేలిక పడ్డారు. ఆయన ఆరోగ్యం బావుండాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

ఇక ఉపేంద్ర కెరీర్ గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇది కాకుండా రామ్ పోతినేని నటిస్తున్న చిత్రంలో కూడా ఉపేంద్ర నటిస్తున్నాడు అని అంటున్నారు. మరి ఈ సినిమాలతో ఉపేంద్ర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలి.