Published On:

PM Modi: సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్.. పీఎం మోదీ విషెస్

PM Modi: సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్.. పీఎం మోదీ విషెస్

Singapore: సింగపూర్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని లారెన్స్ వాంగ్ నేతృత్వంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ భారీ విజయం సాధించింది. ఆ దేశ పార్లమెంట్లోని మొత్తం 97 స్థానాల్లో పీఏపీ ఏకంగా 87 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో లారెన్స్ వాంగ్ మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ” సింగపూర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లారెన్స్ వాంగ్ కు హృదయపూర్వక అభినందనలు” అని రాసుకొచ్చారు. భారత్ కు సింగపూర్ మధ్య బలమైన, మల్టిపర్పస్ భాగస్వామ్యాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆ దేశంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపారు.

కాగా దేశ ప్రధానిగా ఎన్నిక కావడంపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల బలమైన ఆదేశానికి తాము మరోసారి కృతజ్ఞులమని అన్నారు. దేశ ప్రజలందరి కోసం మరింత కష్టపడి పనిచేయడం ద్వారా తమపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తామని తెలిపారు.