Published On:

Munir Ahmed : పాక్ మహిళతో వివాహం.. ఉద్యోగం తొలగించిన ఉన్నతాధికారులు

Munir Ahmed  : పాక్ మహిళతో వివాహం.. ఉద్యోగం తొలగించిన ఉన్నతాధికారులు

CRPF jawan marries Pakistani woman : పాకిస్థాన్ మహిళతో వివాహం చేసుకున్న విషయాన్ని ఓ వ్యక్తి రహస్యంగా ఉంచాడు. వీసా గడువు మగిసినా కూడా ఆమెను భారత్‌లోనే ఉంచాడు. దీంతో మునీర్ అహ్మద్ అనే జవాన్‌ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అతడు జాతీయ మీడియాతో మాట్లాడారు. పాక్ మహిళను వివాహం చేసుకున్నట్లు అధికారులు చెప్పలేదనడంలో వాస్తవం లేదని చెప్పాడు. తన తప్పు ఏమీ లేదని, కావాలని ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు న్యాయం చేయాలని కోరారు. పాకిస్థాన్ మహిళను వివాహం చేసుకున్నట్లు ఇంతకు ముందు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన తన దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయని మీడియాకు వివరించారు.

 

షాక్‌కు గురైన సీఆర్పీఎఫ్ జవాన్..
తనను ఉద్యోగం నుంచి తొలగించినట్లు విషయం తెలియగానే షాక్‌కు గురైనట్లు అతడు తెలిపారు. ఏ కారణం లేకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించారని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పాడు. 2024లో మెనల్ ఖాన్ అనే మహిళను పెళ్లి చేసుకున్నట్లు వివరించారు. ప్రేమ వ్యవహారం గురించి 2022 నుంచి అధికారులకు చెబుతున్నానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఓ జవాన్‌గా తనకు న్యాయం చేయాలని కోరారు.

 

మే నెలలో పాక్‌  అమ్మాయితో వివాహం..
జమ్ముకశ్మీర్‌లోని పవాల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భంగా ఈ ఘటన వెలుగుచూసింది. భారత్‌లో ఉంటున్న పాకిస్థాన్ జాతీయులు స్వదేశానికి వెళ్లాపోవాలని ఇండియా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె వివరాలను ఆరా తీయగా, విషయం బయటపడింది. సీఆర్పీఎఫ్ 41వ బెటాలియన్‌కు చెందిన మునీర్ అహ్మద్ గతేడాది మేలో పాక్‌కు చెందిన మెనల్ ఖాన్‌ను వీడియో కాల్ మాధ్యమంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె వీసాపై ఇండియాకు వచ్చింది. పెళ్లి చేసుకున్న విషయాన్ని తమ దగ్గర దాచాడని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. పైగా వీసా గడువు ముగిసినా ఆ మహిళ భారత్‌లోనే ఉంటోంది.

ఇవి కూడా చదవండి: