Published On:

Amaravati: అమరావతి వైపే..అందరి అడుగులు

Amaravati: అమరావతి వైపే..అందరి అడుగులు

Amaravati: అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభకు బస్సులు బయలుదేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 3400 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరవనున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున కూటమి నేతలు, అభిమానులు తరలివస్తున్నారు.

 

రాజధాని పునర్నిర్మాణ సభకు సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా. జై అమరావతి.. జై జై అమరావతి నినాదాలతో మార్గాలు మార్మోగుతున్నాయి  . అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి హాజరయ్యేలా 8 రూట్లు , 11 పార్కింగ్ ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి.

 

కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదగా రాజధాని పనుల పునః ప్రారంభంకానున్నాయి. అమరావతి రీస్టార్ట్ పేరిట ఈ కార్యక్రమం జరగబోతోంది. కాసేపట్లో గన్నవరం ఎయిర్ పోర్టు‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు.

 

విమానాశ్రయం నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో సచివాలయం వద్ద ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదికకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి సూచికగా పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి హాజరుకానున్నారు.