Heavy Rains: నీట మునిగిన ఉత్తర భారతం.. యూపీలో 9 మంది మృతి
కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తర భారతాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 9 మంది మృతిచెందారు.
New Delhi: కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తర భారతాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నార్త్ స్టేట్స్ లో కుండపోత వర్షాలతో ప్రజలు హడలెత్తుతున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యాణా రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్నాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
ఢిల్లీ, యూపీని కుంభవృష్టి వణికిస్తోంది. భారీ వర్షాల కారణంగా ఉత్తర్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 9 మంది మృతిచెందారు. మరో 24 గంటల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దానితో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో రోడ్లు జలమయం అయ్యాయి. దానితో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోటెత్తిన వరదతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. ఇక భారీ వర్షాలతో లక్నో, నోయిడా, ఘజియాబాద్, కాన్పూర్, ఆగ్రా, అలీఘఢ్ నగరాల్లో పాఠశాలు, విద్యా సంస్ధలకు అక్టోబర్ 12 వరకూ సెలవులు ప్రకటించారు. మరోవైపు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 11 వరకూ వర్షాలు కురుస్తాయని ఐఎండీ సూచించింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఢిల్లీలో వర్షం కురుస్తోంది. ఢిల్లీలోని లోధిరోడ్లో 87.2 మి.మీ. వర్షాపాతం రికార్డయ్యింది. కాగా సఫ్దార్గంజ్లో 74.3 మిల్లీ మీటర్ల రెయిన్ ఫాల్ నమోదయ్యింది. ఇక అయాయ్నగర్లో గత 24 గంటల్లో 85.2 మి.మీ వర్షపాతం రికార్డయినట్టు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: మరో 5రోజుల పాటు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్