Gujarat Rains : గుజరాత్‌లో భారీ వర్షాలు.. 14 మంది మృతి

Gujarat Rains : గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. వర్షం కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో 10 మందికిపైగా మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
168 తాలుకాల్లో అకాల వర్షం..
గుజరాత్‌లోని 168 తాలుకాల్లో నిన్న అకాల వర్షం కురిసింది. కొన్ని తాలుకాలు, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులకు కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. అనేక ఇండ్లు కూలిపోయాయి. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. వాన కారణంగా సంభవించిన వేర్వేరు ప్రమాదాల్లో 14మంది మృతిచెందారు.
ఖేడా జిల్లాలో 4గురు, వడోదరలో ముగ్గురు, ఆరావళి, దాహోద్‌ల్లో ఇద్దరు చొప్పున, అహ్మదాబాద్‌లోని విరామ్‌గామ్, దస్క్రోయ్‌ల్లో ఒక్కొక్కరు మృతిచెందగా, ఆనంద్‌లో ఒకరు మృతిచెందారు. దాదాపు 16 మందికి గాయాలయ్యాయి. 26 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని రోజులు గుజరాత్‌లో పిడుగులతో కూడిన వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.