MP Asaduddin on Pakistan: పాకిస్థాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు : ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

Pakistan does not Deserve to be called Islam said by Asaduddin: పాక్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉర్దూ జర్నలిస్టు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దాడుల విషయంలో పాక్ మజాక్ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. దీంతో పాక్ భారత్ సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి యత్నిస్తోంది. దాడులను భారత ఆర్మీ దీటుగా ఎదుర్కొంటోంది.
దీంతో భారత్-పాక్ సరిహద్దుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత్ సరిహద్దుల్లో పాక్ చేస్తున్న కవ్వింపు చర్యల పట్ల ఎంపీ స్పందించారు. పాకిస్థాన్ భారత్‌లోని అమాయక ప్రజలపై దాడి జరుపుతోందని మండిపడ్డారు. అమాయకులను, చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని వ్యాఖ్యానించారు.
అలాగే ఈ సమయంలో మనందరం జవాన్లకు మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు. దాడుల విషయంలో పాక్ మాటిమాటికి మజాక్ చేస్తుందని, దాడి చేస్తే ఇండియా వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. అమాయకులను, చిన్న పిల్లలను చంపే పాక్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని హాట్ కామెంట్స్ చేశారు. అమ్మ కడుపులో నుంచి భూమిపై పడ్డామని, అలాంటప్పుడు చచ్చేవరకూ ఈ భూమి కోసమే బతకాలని ఎంపీ వ్యాఖ్యానించారు.