Home / IMD
Heavy Rain Alert To AP For The Next Three days: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్రేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. ప్రధానంగా కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలోని […]
ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతంశుక్రవారం తెల్లవారుజామునుంచి ఉరుములు మరియు ఈదురు గాలులతో కూడిన ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలమైంది.ఇటీవలి వేడి నుండి ఢిల్లీవాసులకు చాలా ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది.
దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఇవాళ 52.3 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు 49డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటి పోయాయి. అలాగే రాజస్థాన్ లోని చురు, హర్యానాలోని సిర్సాతో సహా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఆల్ టైమ్ రికార్డుగా నిలిచాయి.
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. కూకట్పల్లి, మియాపూర్, బాలానగర్, సనత్‌నగర్..పంజాగుట్ట, మాదాపూర్, ఉప్పల్, జీడిమెట్లలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
శుక్రవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండి) దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లకు ‘ఆరెంజ్’ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ ఆది, సోమవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఆవర్తనం కొనసాగుతుందని, ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ స్థిరంగా ఉన్నట్టు వాతారణ శాఖ స్పష్టం చేసింది.
Hyderabad Rain: హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం మారింది.
3 రోజుల పాటు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది.
ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
Telangana Rains: పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.