Published On:

Monsoon @ May 27th: వాతావరణశాఖ అలర్ట్.. నెలాఖరున కేరళకు నైరుతీ రుతుపవనాలు!

Monsoon @ May 27th: వాతావరణశాఖ అలర్ట్.. నెలాఖరున కేరళకు నైరుతీ రుతుపవనాలు!

IMD  says Rainy Season starts form May 27th: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి భానుడి భగభగలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండలకు తాళలేక చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా ద్రవపదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.

 

దేశంలో ఈ ఏడాది వర్షాకాలం ముందుగానే రానుంది. ఈ మేరకు మే 27న నైరుతీ రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు భారతీయ వాతావరణశాఖ పేర్కొంది. కాగా గతంలో 2009లో నైరుతీ రుతుపవనాలు మే 23నే కేరళ తీరాన్ని తాకినట్లు ఐఎండీ వెల్లడించింది. అయితే అంతకంటే ముందుగానే అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయని అధికారులు వెల్లడించారు.

 

సాధారణంగా నైరుతీ రుతుపవనాలు జాన్ 1 నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత జూలై 8 నాటికి దేశం మొత్తం విస్తరిస్తాయి. ఇక ఈఏడాది దేశంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ చెప్తోంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనుకున్నదానికంటే ఏక్కువగానే వానలు కురిసే ఛాన్స్ ఉందని సమాచారం. కాగా వర్షాకాలం త్వరగానే రాబోతుందన్న సమాచారంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.