Jayam Ravi Mohan Wife Post: సింగర్‌తో నటుడు ‘జయం’ రవి ఎఫైర్.. భార్య ఎమోషనల్ పోస్ట్!

Kollywood Hero Ravi Mohan Wife Emotional Post: తమిళ నటుడు ‘జయం’ రవి తన వ్యక్తిగత విషయాలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. గతేడాది తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరి విడాకుల ప్రాసెస్ కోర్టులో ఉంది. సింగర్ కెన్నీషాతో డేటింగ్ చేస్తున్నాడని అందుకే భార్యకు విడాకులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని ఈ రూమర్స్‌ని కొట్టిపారేశాడు. అయితే ఇప్పుడు సింగర్‌తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. నిర్మాత ఇషారి గణేష్ కూతరి పెళ్లి వేడుకకు.. కోలీవుడ్ స్టార్స్ అంతా హాజరయ్యారు. అలాగే జయం రవి కూడా ఈ పెళ్లిలో పాల్గొన్నారు.
కానీ అతడితో గాయనీ కెన్నీషా కూడా ఉంది. ఇద్దరు జంటగా కనిపించిన పోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సందర్భంగా జయం రవి భార్య ఆర్తి సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. “ఏడాదిగా నేను మౌనాన్ని కవచంలా మోస్తున్నాను. అలా అని నేను బలహీనురాలిని అని కాదు. నా పిల్లల మనశాంతి ముఖ్యం అనుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ భరిస్తున్నాను. నాపై ఎన్నో ఆరోపణలు చేశావ్. అయినా నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు విడిపోయారనే బాధ నా పిల్లలకు ఉండకూడదు అనుకున్నా. అంతేకాదు నా వైపు నిజం లేదని కాదు. ఇప్పుడు ప్రపంచమంత ఫోటోలు చూస్తోంది.
18 ఏళ్లు సంసారం చేసిన వ్యక్తి.. ప్రేమ, నమ్మకంతో పాటు ప్రమాణం చేసిన ప్రతి బాధ్యతని పక్కనబెట్టి నన్ను వదిలి వెళ్లిపోయాడు. నా బాధ్యత అని చెప్పిన ఆ వ్యక్తి.. ఆర్థికంగా కానీ, నైతీకంగా కానీ కనీస సాయం చేయట్లేదు. మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. నాతో కలిసి ఇదే ఇంటిని నిర్మించిన ఆ వ్యక్తి.. బ్యాంక్ అధికారులతో కలిసి నేను బయటకు వెళ్లిపోయేలా కుట్ర చేశాడు. అయినా నేను లెక్కల కంటే ప్రేమ, నమ్మకానికే విలువ ఇచ్చాను. నేను డబ్బుల కోసమే ఈ విడాకుల డ్రామా ఆడుతున్నానని అందరు అనుకుంటున్నారు. అదే నిజమనుకుంటే ఇప్పటికే నా స్వార్థం చూసుకునేదాన్ని. కానీ అలా చేయలేదు. ప్రేమని పంచాను. నమ్మకం చూపించాను. ఇప్పుడదే నన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది.
ప్రేమించినందుకు నేను ప్రశ్చాత్తాప పడటం లేదు. కానీ, దాన్ని ఓ బలహీనతలా ఉపయోగించుకున్నందుకు బాధపడుతున్న. నా కొడుకుల వయసు 10,14. వాళ్లకు ఇప్పుడు కావాల్సింది భద్రత. ఈ చట్టాల గురించి అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లలు వాళ్లు. సమాధానం లేని ఫోన్ కాల్స్, రద్దయిన మీటింగ్స్, రిప్లై లేని మెసేజ్‌లు.. ఇవన్నీ నాకు తగిలిన గాయాలు. ఈ రోజు నేను భార్యగా అన్యాయానికి గురైన మహళగా కాదు.. పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నా.
ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పటికీ ఫెయిల్యూర్‌గానే మిగిలిపోతాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే తండ్రి అంటే టైటిల్ కాదు బాధ్యత. నువ్వు ఏమైనా చేయొచ్చు గానీ నిజాన్ని తిరిగి రాయాలేవు కదా. మా విడాకుల ప్రాసెస్ ఇంకా కోర్టులో ఉంది. అప్పటి వరకు నా పేరు ఆర్తి రవినే. మీడియా వాళ్లకు నా విన్నపం ఒక్కటే. దయచేసిన నా మాజీ భార్య అని సంభోదించవద్దు. ఇంకా మేము లీగల్‌గా విడాకులు తీసుకోలేదు. ప్రతికారం కోసమే, మరేదో కాదు. నా పిల్లల కోసం పోరాటం చేస్తున్నా. వాళ్లనే కాపాడే తల్లిగా ఇది నా బాధ్యత. నేను ఏడవను, అరవను. నిన్ను ఇంకా నాన్న అని పిలుస్తున్న నా ఇద్దరు పిల్లల కోసం బలంగా నిడబతా” అని ఆర్తి రవి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram