Home / Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోపిడుగుపాటు కారణంగా 11 మంది మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతాప్‌గఢ్‌లోని పోలీసు మరియు జిల్లా పరిపాలన సంయుక్త బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి .
:ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం యొక్క మొదటి విడత పొందిన తర్వాత దాదాపు 11 మంది వివాహిత మహిళలు తమ ప్రేమికులతో పారిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాటలో మరణించిన బాధితుల కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు.హత్రాస్ పర్యటనకు ముందు అలీఘర్‌లోని పిలాఖ్నా గ్రామంలో ఆగి, అక్కడ కూడా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం స్వయం ప్రకటిత సాధువు భోలే బాబా నేతృత్వంలోని మతపరమైన సమ్మేళనం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 116 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పటి నుండి అతని ఆచూకీ తెలియలేదు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన ఒక మతపరమైన సమావేశంలో తొక్కిసలాటలో 80 మందికి పైగా మరణించారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులను హత్రాస్ మరియు పొరుగున ఉన్న ఎటా జిల్లాలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు
జనవరి 22న జరగనున్న రామమందిర 'ప్రాణప్రతిష్ఠ'కు ముందు బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామజన్మభూమి ఆలయ గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ఉంచారు.
లక్షలాది మంది భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. అయోధ్యలో గురువారం కొత్తగా నిర్మించిన రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ఉంచారు.మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలోకి తీసుకువచ్చారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా జడ్జి తనను జిల్లా జడ్జి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, తాను చనిపోవడానికి అనుమతించాలంటూ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదికను కోరారు.
ఇంట్లో ఉన్న పాముని తరిమికొట్టడానికి ఒక కుటుంబం చేసిన ప్రయత్నం విషాదాన్ని మిగిల్చింది. పాముకోసం పొగ బెట్టడంతో ఇంట్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో వస్తువులన్నీ బూడిదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఇప్పటివరకు 24 మరణాలు నమోదయ్యాయి. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల డేటాను కలుపుకుంటే మరణాల సంఖ్య పెరుగుతుంది.