Published On:

India Cancelled Pakistani’s Visas: భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్థాన్ పౌరుల వీసాలు రద్దు!

India Cancelled Pakistani’s Visas: భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్థాన్ పౌరుల వీసాలు రద్దు!

India Cancelled Pakistani’s Visas over Pahalgam Terror Attack:  పహల్గామ్ ఉగ్రదాడి కలిచివేసింది. ఈ నేపథ్యంలో భారత్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పౌరులకు అన్ని వీసాలు రద్దు చేసింది. అనంతరం మరో 72 గంటల్లో భారత్ విడిచి పెట్టాలని పాక్ పౌరులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మెడికల్ వీసాలను ఏప్రిల్ 29 వరకే అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా భారత పౌరులు పాకిస్థాన్ వెళ్లరాదని కేంద్రం సూచించింది.

 

ఇదిలా ఉండగా, ఇప్పటికే వీసా పొందిన వారికి ఈ నెల 27 వరకు గడువు ఇవ్వగా.. మెడికల్ వీసాలపై ఈ నెల 29 వరకు సమయం ఇచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. వీసా గడువులోగా పాక్ పౌరులు దేశాన్ని వీడాలని అందులో పేర్కొంది. అలాగే భారతీయులు ఎవరూ కూడ పాకిస్థాన్ దేశంలో ప్రయాణించవద్దని చెప్పింది. అంతేకాకుండా ఎవరైనా పాకిస్థాన్‌లో ఇప్పటికే ఉంటే వెంటనే భారత్ తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది.