Indian Territorial Army: రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ.. యుద్ధ భూమికి సచిన్, ధోనీలు?

Indian Army wants to involve Territorial Army in India – Pakistan War: పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది. ఇందులోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. ప్రస్తుతం దాదాపు 50 వేల మంది వరకు ఈ ఆర్మీలో ఉన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్, ధోనీతో సహా మరికొంతమంది ఉన్నారు.
టెరిటోరియల్ ఆర్మీ అంటే రెగ్యులర్ ఆర్మీకి సెకండ్ ఆర్మీ ఫోర్స్ గా పిలుస్తారు. దీన్ని పార్ట్ టైమ్ ఆర్మీగా ఉంటూ ఫుల్ టైమ్ ట్రైనింగ్ ఇస్తారు. జీతాలు కూడా ఫుల్ టైం ఆర్మీకి ఇచ్చినట్లే ఇస్తారు. అత్యవసర పరిస్థితుల్లో వీరు ఆర్మీకి సహకారం అందిస్తుంటారు. టెరిటోరియల్ ఆర్మీలో కపిల్ టెండుల్కర్, కపిల్ దేవ్, ధోనీ, కాంగ్రెస్ ఎంపీ సచిన్ పైలట్, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఉన్నారు.
పాకిస్తాన్ తన వక్రబుద్ది మార్చుకోవడం లేదు. నిన్న అర్ధరాత్రి నుంచి భారత్‌పై పాక్.. మిస్సైల్స్, డ్రోన్లతో విరుచుకపడుతోంది. ఈ దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ శకలాలు బయటపడుతున్నాయి. దీంతో పాకిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్‌కు చెందిన రెండు ఫైటర్ జెట్లను భారత్ కూల్చేసింది. భారీగా డ్రోన్లు, మిస్సైల్స్‌ను భారత్ కూల్చివేసింది. జనావాసాలు, పౌరులను పాకిస్తాన్ టార్గెట్ చేస్తు్ంది. పాకిస్తాన్ కుయుక్తులను భారత్ తిప్పి కొడుతుంది.