Published On:

India Pak War: త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ

India Pak War: త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ

India Pak War: భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లతో పాటు ఢిల్లీ, హర్యానా, బెంగాల్‌లోనూ భద్రత కట్టుదిట్టం చేసింది. పోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసింది. అలాగే గుజరాత్‌ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేసింది.

 

సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని మోదీతో ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ భేటీకానున్నారు. CDS, త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ కానున్నారు.

 

జమ్మూ టార్గెట్ గా పాకిస్థాన్ దాడులు చేస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. స్కూల్లకు సెలవులను ప్రకటించింది. ఇప్పటివరకు 50 పాకిస్థాన్ డ్రోన్ లను భారత ఆర్మీ నేలకూల్చింది.