Amala Paul Pregnancy: నా భర్తకు నేను నటిని అని తెలియదు – ప్రెగ్నెంట్ అయ్యాకే పెళ్లి చేసుకున్నా: అమలా పాల్ కామెంట్స్

Amala Paul about Her husband and Pregnancy: ప్రెగ్నెంట్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాననని చెప్పింది నటి అమలాపాల్. ఇద్దరమ్మాయిలు చిత్రంలో తెలుగులో గుర్తింపు పొందిన ఈ భామ తర్వాత నాయక్, బెజవాడ వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన ఆమె అక్కడ లేడీ ఒరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె వంటి చిత్రాల్లో బోల్డ్ రోల్స్‌లో కనిపించింది షాకిచ్చింది. అయితే 2023లో జగత్ దేశాయ్‌తో ఆమె ఏడగులు వేసిన సంగతి తెలిసిందే.
ఇది ఆమెకు రెండో పెళ్ల అనే విషయం తెలిసిందే. సైలెంట్‌గా జగత్ దేవాయ్‌ని ప్రేమ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట ఓ బిడ్డ కూడా ఉంది. కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె ఈ మధ్యే నిర్మాతగా, నటిగా రీఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా ఆమె జేఎఫ్ డ్యబ్లూ మూవీ అవార్డు వేడుకలో పాల్గొంది. ఇందులో ఉత్తమ నటి (క్రిటిక్) క్యాటగిరిలో అమలాపాల్ అవార్డు గెలుచుకుంది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పింది. జగత్ దేశాయ్‌తో ప్రేమ, పెళ్లి గురించి చెప్పింది.
నిజానికి పెళ్లి అంటే ఇటూ అటూ ఏడుతరాలు చూసుకుంటారు. అమ్మాయి/అబ్బాయి వాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటీ? తదితర విషయాలు తెలుసుకుని పెళ్లికి సిద్ధమవుతారు. కానీ, హీరోయిన్ అమలాపాల్ గురించి తన భర్తకు ఏం తెలియదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. “జగత్ దేశాయ్‌ది గుజరాత్. కానీ అతడు గోవాలో సెటిలైయ్యాడు. ఇద్దరికి గోవాలో పరిచయం. నాది కేరళ అని చెప్పాను. అతడు దక్షిణాది సినిమాలు చూడడు కాబట్టి నేను నటిని అనే విషయం అతడికి తెలియదు. నేను కూడా ఆ విషయాన్ని తనకు చెప్పలేదు. మా స్నేహం ప్రేమగా మారింది. కొన్నాళ్ల తర్వాత న ఏను ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం.
గర్భంతో ఇంట్లో ఉన్నప్పుడ నా సినిమాలని ఒక్కొక్కటిగా జగత్‌కు చూపించారు. నా సినిమాలు చూస్తూ తను చాలా ఎంజాయ్ చేశాడు. నేను అవార్డ్స్ తీసుకున్న వీడియోలు చూస్తూ తెగ మురిపోయాడు” అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతంలో ఆమె డైరెక్టర్ ఏఎల్ విజయ్‌ని 2014లో పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకే వీరి వైవాహిక బంధంలో కలతలు రావడంతో మూడేళ్లకే(2027)విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2023లో బిజినెస్ మ్యాన్ జగత్‌దేవాయిన్ ఆమె రెండో పెళ్లిచేసుకుంది. 2024లో వీరికి ఓ కొడుకు పుట్టాడు.