Vijay Devarakonda donation to Indian Army: విజయ్ దేవరకొండ మంచి మనసు.. భారత సైన్యానికి విరాళం!

Vijay Devarakonda announced Donation to Indian Army amid India Pakistan War: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకున్నాడు. భారత సైన్యానికి విరాళం ప్రకటించారు. నిన్న శుక్రవారం (మే 9) విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేశాడు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య యుద్దం నెలకొన్న పరిస్థితుల్లో భారత సైన్యానికి మద్దుతుగా పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తనవంతు బాధ్యతగా విజయ్ భారత సైన్యానికి విరాళం ప్రకటించాడు.
తన బర్త్‌డే సందర్భంగా విజయ్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. “అందరికి నమస్కారం. ప్రస్తుత దేశ పరిస్థితుల నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. అలాగే విజయ్ దేవరకొండ బర్త్‌డే ట్రక్ పేరుతో హైదరాబాద్, వరంగల్, కర్నూల్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ప్రీగా ఐసీక్రిం పంపిణీ చేస్తున్నాను. ఈ ట్రక్ ఎక్కడ కనిపించిన వెళ్లి ఐస్‌క్రీం తీసుకోవచ్చని చెప్పాడు. అనంతరం భారత సైన్యానికి విరాళం ప్రకటించాడు. ఈ రోజు నా బర్త్‌డే. ఈ సందర్భంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నా.
కొన్ని రోజులుగా మన దేశంలో నెలకొన్న పరిస్థితులు నన్ను ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ బార్డర్‌లో భారత సైన్యం పాకిస్తాన్‌తో విరోచితంగా పొరాడుతోంది. ఈ సమయంలో ఓ పౌరుడిగా నా వంతు బాధ్యతగా ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను. నా రౌడీ బ్రాండ్ సేల్స్ రాబోయో కొన్ని వారాల పాటు అమ్మకాల్లో వచ్చే లాభాల్లో కొంత వాటాని భారత సూన్యానికి ఇవ్వాలనుకుంటున్న” అంటూ వీడియో చెప్పుకొచ్చాడు.
అలాగే నిర్మాత అల్లు అరవింద్ కూడా భారత సైన్యానికి విరాళం ప్రకటించారు. ఆయన సమర్పణలో వచ్చిన సింగిల్ మూవీ కలెక్షన్స్‌లో కొంత భాగంగా భారత సైన్యానికి విరాళం ప్రకటించారు. ఈ సినిమా మే 30 థియేటర్లకో రానుంది.
This year, @TheDeverakonda's birthday is more than a celebration – it’s about giving back.
Spot the Deverakonda Birthday Truck in your city and grab a free ice cream!
And for the next few weeks, a portion of all #RWDY proceeds will go to the Indian Armed Forces.
Jai Hind.… pic.twitter.com/al65L0NWum
— Suresh PRO (@SureshPRO_) May 9, 2025