Colonel Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి ఎవరు? ‘ఆపరేషన్ సిందూర్’పై ఏం చెప్పారంటే?

Who is Colonel Sophia Qureshi, briefed media on Operation Sindoor: పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడి చేయగా.. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడుల అనంతరం ఢిల్లీలో భారత సాయుధ దళాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలుత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడారు. అనంతరం భారత సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ సంయుక్తంగా ‘ఆపరేషన్ సిందూర్’పై మాట్లాడారు.
పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టామని, 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. అక్కడి పౌర స్థావరాలకు నష్టం కలగకుండా దాడులు జరిగాయన్నారు. అయితే ప్రస్తుతం మీడియా సమావేశంలో మాట్లాడిన కల్నల్ సోఫియా ఖురేషితో పాటు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎవరనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది.
కల్నల్ సోఫియా ఖురేషి ఇండియన్ ఆర్మీలో సిగ్నల్స్ కార్ప్స్ విభాగానికి చెందిన అధికారి. అలాగే, సోఫియా గుజరాత్‌కు చెందిన ఆమె జీవ రసాయన శాస్త్రంలో పీజీలో ఉత్తీర్ణత సాధించారు. కల్నల్ సోఫియా ఖురేషి భర్త మెకనైజ్డ్ విభాగంలో ఓ అధికారిగా పనిచేస్తున్నారు. అలాగే ఆమె గ్రాండ్ ఫాదర్ కూడా ఆర్మీలో పనిచేశారు.
అయితే, ఆమె 2016లో ఎక్సర్స్‌జ్ ఫోర్స్ 18లో ఇంటర్నేషనల్ ఆర్మీ గ్రూపులో భారత బలగాలకు నాయకత్వం వహించారు. ఇందులో 18 దేశాల బృందాలు పాల్గొనగ ఆమె మాత్రమే మహిళా నాయకురాలుగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఆమె యూఎన్‌ఓ శాంతి బలగాల్లో 6 ఏళ్లు సేవలు అందించారు. అంతేకాకుండా కాంగోలో 2006లో జరిగిన మిషన్‌లో కీలక పాత్ర పోషించారు.