Karna Pishachini: సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రీల్లర్ కర్ణ పిశాచి.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..!

Karna Pishachini Now Streaming on Amazon Prime: ఓటీటీలు వచ్చాక మూవీ లవర్స్ డబుల్ ఎంటర్‌టైన్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఓటీటీలో కొత్త కంటెంట్ వస్తోంది. ఈ వీకెండ్‌కి ఓటీటీలో సరికొత్త కంటెంట్ వచ్చేసింది. నేడు శనివారం ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ సడెన్ ఎంట్రీ ఇచ్చింది. ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ మూవీ ఓటీటీ రావడంతో మూవీ లవర్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఇంతకి అది ఏ సినిమా ఏంట? స్ట్రీమింగ్ ఎక్కవ అవుతుందో చూద్దాం.
కాగా గతేడాది డిసెంబర్ 27న థియేటర్ల ‘కర్ణ పిశాచి’ విడుదలైంది. భరత్ సిగిరెడ్డి ఈ సినిమాను హారర్ థ్రిల్లర్‌గా నిర్మించారు. విజయ్ మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రణవి, రమ్యశ్రీ, నిఖిల్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. ఓటీటీలో విడుదలై సుమారు ఐదు నెలల తర్వాత ఈ చిత్రం ఆకస్మాత్తుగా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైం వీడియోస్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే..
ప్రేమలో, జీవితంలో ఫెయిల్ అయిన ఓ యువకుడి కథ ఇది. ప్రేమలో విఫలమైన అతడు మందుకు బానిసవుతాడు. ఓ సందర్భంలో అనుకోకుండ తన పూర్వీకులకు సంబంధించిన ఓ గ్రంథం ఈ కుర్రాడికి దొరుకుతుంది. ఆ పుస్తకం కారణంగా అతడి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేదే ఈ కథ.