Published On:

Ban on Drones: శంషాబాద్ విమనాశ్రయం పరిధిలో డ్రోన్లపై నిషేధం: సైబరాబాద్ సీపీ

Ban on Drones: శంషాబాద్ విమనాశ్రయం పరిధిలో డ్రోన్లపై నిషేధం: సైబరాబాద్ సీపీ

Ban on Drones at Shamshabad Airport during India – Pakistan War: భారత్‌-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించారు. ఎయిర్ పోర్టుకు 10కిలో మీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించినట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. డ్రోన్లపై నిషేధం జూన్ 9వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

 

బాణసంచా కాల్చడంపై నిషేధం..

హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాలు, కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఆకస్మిక శబ్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. బాణసంచా పేలుళ్లను ఉగ్రవాదుల కార్యకలాపాలుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరులు సహకరించాలని కోరారు. పోలీసుల ఆదేశాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి: