Vande Bharat Express: నాలుగోసారి.. గుజరాత్‌లో మహిళను ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్
గుజరాత్‌లోని గాంధీనగర్ మరియు మహారాష్ట్రలోని ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కు వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
Gujarat: గుజరాత్‌లోని గాంధీనగర్ మరియు మహారాష్ట్రలోని ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కు వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రైలు మంగళవారం ఆనంద్ సమీపంలో 54 ఏళ్ల మహిళను ఢీకొట్టింది. సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన తర్వాత ఈ రైలుకు ఇది నాల్గవ ప్రమాదం. గతంలో గాంధీనగర్-ముంబై మార్గంలో పశువులను ఈ రైలు ఢీకొట్టిన సంఘటనలు నమోదయ్యాయి.
అహ్మదాబాద్‌కు చెందిన ఆర్చిబాల్డ్ పీటర్ అనే మహిళ ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ దాటుతుండగా సాయంత్రం 4.37 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. గత నెల రోజులుగా గాంధీనగర్-ముంబై రూట్లో వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాల పై పశువులను ఢీకొనడంతో మూడుసార్లు దెబ్బతిన్నది. అక్టోబరు 6న, వత్వా మరియు మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు గేదెల మందను ఢీ కొట్టడంతో దాని ముందు ప్యానెల్ దెబ్బతిన్నది. మరుసటి రోజు (అక్టోబర్ 7) ఆనంద్ సమీపంలో రైలు ఆవును ఢీకొట్టింది. మరో ఘటనలో గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఎద్దును ఢీకొట్టింది.