Home / Gujarat
PM Modi’s Lion Safari At Gujarat’s Gir On World Wildlife Day: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో గిర్ అభయారణ్యంలో పర్యటించారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సం సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్య టన అనంతరం ప్రధాని జునాగఢలోని ససాన్లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలోపాల్గొన్నారు. గిర్ అభయారణ్యంలో పర్యటిస్తున్న క్రమంలో ప్రధాని స్వయంగా కెమెరాతో అక్కడున్న సింహాలను ఫొటోలు తీయడం విశేషం. ప్రధానికి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫీ అంటే […]
గుజరాత్ లో చండీపురా వైరస్తో ఆరుగురు చిన్నారులు మరణించారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. రాష్ట్రంలో ఈ వైరస్ కు సంబంధించి మొత్తం 12 కేసులు నమోదయ్యాయన్నారు.
: ఓటు హక్కుపై అధికారులు ఎన్నిరకాలుగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగానే ఉంటోంది. నిరక్షరాస్యుల సంగతి అలా ఉంచితే విద్యావంతులు కూడా ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. పోలింగ్ నాడు సెలవుదినం కావడంతో ఇళ్లల్లోనే కాలక్షేపం చేయడం, ఇతరత్రా వ్యాపకాలతో మునిగితేలుతున్నారు.
గుజరాత్లోని వడోదర హర్ని సరస్సులో గురువారం పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. ఘటన జరిగినప్పుడు పడవలో 23 మంది పిల్లలు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. రెస్క్యూ టీమ్ సరస్సు నుండి ఐదుగురు పిల్లలను రక్షించింది.
గుజరాత్లోని సూరత్ లో రసాయన కర్మాగారంలో జరిగిన పేలుడు జరిగి ఏడుగురు కార్మికులు మరణించగా 25 మంది గాయపడ్డారు. ఏడుగురు కార్మికుల మృతదేహాలను గురువారం తెల్లవారుజామున తయారీ కేంద్రం ఆవరణ నుండి స్వాధీనం చేసుకున్నారు, గాయపడిన 25 మంది కార్మికులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గుజరాత్లో విస్తారంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటివరకు పిడుగులు పడి 20 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఎస్ఈఓసీ ) అధికారి ఈ విషయాన్ని తెలిపారు.
బిపర్ జోయ్ తుఫాను ఈరోజు గుజరాత్లోని జాఖౌ నౌకాశ్రయానికి సమీపంలో సౌరాష్ట్ర మరియు కచ్ ను ఆనుకుని ఉన్న పాకిస్తాన్ తీరాలను దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రం 4-5 గంటలకు బిపర్ జోయ్ తుఫాను తీరం దాటనుంది.
గుజరాత్ లోని తాపీ జిల్లాలో మాయాపూర్, దేగామ గ్రామాలను కలుపుతూ మింధోలా నదిపై నిర్మించిన వంతెన బుధవారం కూలిపోయింది. ఇంకా ప్రారంభోత్సవం జరగకుండానే ఈ వంతెన కూలిపోవడం గమనార్హం. 2021లో రూ.2 కోట్లతో ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణం ఇప్పుడు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది. దీని నిర్మాణ సమయంలో నాసిరకం వస్తువులు వాడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
బిపర్ జోయ్ తుఫాను దృష్ట్యా గుజరాత్లోని సౌరాష్ట్ర మరియు కచ్ తీరాలకు భారత వాతావరణ శాఖ ( ఐఎండి) మంగళవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. జూన్ 15 సాయంత్రానికి బిపర్ జోయ్ తుఫాను జఖౌ పోర్ట్ ప్రాంతాన్ని దాటే అవకాశం ఉంది.
గుజరాత్లోని రాజులా నగరానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే హీరా సోలంకి సముద్రంలో మునిగిపోతున్న ముగ్గురు యువకులను రక్షించి ప్రశంసలు అందుకుంటున్నారు. నలుగురు యువకులు పట్వా గ్రామం సమీపంలోని సముద్ర తీరంలో చేయడానికి వెళ్లిన సందర్బంగా మునిగిపోవడం ప్రారంభించారు.