Rajnath Singh on Operation Sindoor: ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పాం..‘ఆపరేషన్ సిందూర్’ పై రక్షణమంత్రి కీలక వ్యాఖ్యలు!

Defence Minister Rajnath Singh Key Statements on Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’తో ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. భారత్ శక్తి ఏంటో మరోసారి నిరూపించామని తెలిపారు. ఇందులో పాక్ ప్రజలను ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదని, కానీ భారత్ ప్రజలపై పాక్ దాడి చేసిందని వెల్లడించారు. అయితే పాక్ సరిహద్దు మాత్రమే కాదు.. లోపలికి చొచ్చుకొని వెళ్లి అనేక దాడులు చేశామని వివరించారు. అలాగే రావల్పిండిపై కూడా దాడి చేసినట్లు చెప్పారు.
ఉగ్రవాదాన్ని భారత్ సహించదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ లో బ్రహ్మోస్ శక్తి స్పష్టమైందన్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. భారత సంకల్పాన్ని ఆపరేషన్ సిందూర్ చాటి చెప్పిందన్నారు. భారత సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సిందూర్ నిదర్శనమన్నారు.
ఇదిలా ఉండగా, యూపీలోని లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్‌ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. బ్రహ్మోస్ ఏర్పాటుకు సహకరించిన యూపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇందులో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్లను కేవలం 40 నెలల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోస్ కేవలం ఆయుధం కాదు.. సందేశమన్నారు.
లక్నో రూ.300 కోట్లతో బ్రహ్మోస్ తయారీ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇందుో ఏటా 100 బ్రహ్మోస్ క్షిపణిలను తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఇందుకోసం 80 హెక్టార్ల స్థలం కేటాయించారు. ఇది నేల, ఆకాశం, సముద్రం లోపల నుంచి ప్రయోగించొచ్చు. సుమారు 200 నుంచి 300 కిలోల వార్ హెడ్ మోసుకెళ్లగలదు. అయితే బ్రహ్మోస్ ప్రభావంను పాక్‌ను అడిగితే తెలుస్తుందని యూపీ సీఎం యోగా అన్నారు.
ఇదిలా ఉండగా, పాక్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 10 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసినట్లు కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. అయితే ఈ దాడులకు ఐఏఎఫ్ తొలిసారిగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. పాక్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించడంతోనే భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ విధంగా అణు యుద్ధానికి దారితీయొచ్చనే భయంతోనే యూఎస్ , ఇతర దేశాలు కలగజేసుకొని సీజ్ ఫైర్‌కు భారత్‌ను ఒప్పించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- Sunny Joseph as KPCC President: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సన్నీ జోసెఫ్.. రేపు బాధ్యతల స్వీకరణ