Sunny Joseph as KPCC President: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సన్నీ జోసెఫ్.. రేపు బాధ్యతల స్వీకరణ

Sunny Joseph as Kerala Pradesh Congress Committee President: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిని అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సన్నీ జోసెఫ్‌ను నియమించారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత కేరళ అధ్యక్షుడు కె.సుదర్శన్ జోసెఫ్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. ఎమ్మెల్యేలు పీసీ విష్ణునాథ్, ఏపీ అనిల్ కుమార్, ఎంపీ షరీఫ్ పరంబిల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎంపీ అడూర్ ప్రకాశ్ యూడీఎఫ్ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా సన్నీ జోసెఫ్‌తోపాటు విష్ణునాథ్, పరంబిల్, అనిల్ కుమార్ త్రిసూర్‌లో కేరళ కాంగ్రెస్ పార్టీ దిగ్గజం, మాజీ సీఎం, దివంగత కరుణాకరన్ స్మారకాన్ని సందర్శించి నివాళులర్పించారు. కొట్టాయంలో మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్మారకం వద్ద నివాళులర్పించారు.