Published On:

Brahmos Missile: ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోస్ కు భారీ డిమాండ్.. కొనడానికి పలుదేశాలు పోటీ

Brahmos Missile: ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోస్ కు భారీ డిమాండ్.. కొనడానికి పలుదేశాలు పోటీ

Brahmos Missile: ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రంగా మారింది. దీంతో మన బ్రహ్మోస్‌కు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణుల కోసం 17 దేశాలు క్యూ కట్టాయి. ఆధునిక యుద్ధ తంత్రానికి దిక్చూచిగా మారిన బ్రహ్మోస్ మిస్సైల్స్ కోసం… 200 నుంచి 300 మిలియన్ డాలర్లతో ఇండోనేషియా డీల్‌కు సిద్ధమవుతుంది. మరోవైపు 700 డాలర్లతో ఒప్పందం కుదుర్చుకునేందుకు వియత్నాం ప్లాన్ చేస్తుంది. అలాగే బ్రహ్మోస్ కోసం మలేషియా, సౌత్ ఏషియన్ కంట్రీస్ థాయ్ లాండ్, సింగపూర్, బ్రూనై దేశాలు క్యూలో ఉన్నాయి. అంతేకాకుండా బ్రహ్మోస్‌పై లాటిన్ అమెరికాలోని బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా దేశాల కన్నుపడింది. ఇక ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్లు కూడా బ్రహ్మోస్‌ను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి.

పహల్గాం ఉగ్రదాడితో భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. బ్రహ్మోస్, ఆకాశ్ లు అనుకున్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో తాకడంతో ప్రపంచ దేశాలు మనవైపు చూస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ పై దాదాపు 15 బ్రహ్మస్ క్షిపణులను వాడారు. అందులో అన్ని గురితప్పకుండా రాడార్ లను దాటుకుని లక్ష్యాన్ని చేధించాయి. ఇవి 400 నుంచి 450 కిలోమీటర్ల లక్ష్యాన్ని సునాయాసంగా పూర్తిచేసే సామర్థ్యం ఉంది. వీటిని భూమి, ఆకాశం, సముద్రం మీద నుంచి సునాయాసంగా ప్రయోగించవచ్చు.

భారతదేశంలోని బ్రహ్మపుత్రానది, రష్యాలోని మోస్క్వా నది రెండు పేర్లను కలిపి బ్రహ్యోస్ గా పెట్టారు. హిందూ పురాణాల్లోని బ్రహ్మాస్త్రం ను ద్వనించేలాగా కూడా ఉండేట్లు చూసుకున్నారు. ప్రపంచంలోని నౌకాదళ విధ్వంసక క్షిపణులలో బ్రహ్యోస్ అత్యంత వేగవంతమైనది. ఇది 2.8 – 3.0 వేగంతో ప్రయాణిస్తుంది. బ్రహ్మోస్ ప్రపంచలోనే ఏకైక స్వల్ప శ్రేణి సూపర్ సోనిక్ మిసైల్. ఇది క్రూయిజ్ క్షిపణి P-800 ఓనిక్స్ సాంకేతికతపై ఆధారపడి ఈ క్షిపణిని తయారు చేశారు. దీన్ని భారత్ రష్యాలు సంయుక్తంగా కలిసి తయారు చేశారు.