Published On:

Medak Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి

Medak Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి

Medak Road Accident : రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావుపేట స్టేజీ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి షాపూర్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి మెదక్ వైపు ఆల్టో కారు వెళ్తున్నారు. ఇదే సమయంలో ఎదురుగా వచ్చిన మరో కారు ఆల్టో కారును ఢీకొట్టింది. దీంతో ఆల్టోకారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులను ఎండీ గౌస్, అలీ, అజీమ్ బేగంగా గుర్తించారు.

 

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ షాపూర్‌నగర్‌కు చెందిన పిల్లలతోపాటు 9 మంది కారులో ప్రయాణిస్తూ మెదక్ వైపు వెళ్తుండగా, రైలాపూర్ గ్రామానికి చెందిన హరీశ్‌రెడ్డి గ్రామం నుంచి నర్సాపూర్ వైపు వెళ్తుండగా వెంకట్రావుపేట గేటు సమీపన అతివేగంతో రెండు కార్లు ఢీకొన్నాయి. ఘటనలో షాపూర్‌నగర్‌కు చెందిన మహమ్మద్ అలీ (45), అజీమా బేగం (40) మహమ్మద్ గౌస్‌తోపాటు సంవత్సరం బిడ్డ మృతిచెందారు. మిగిలిన 6 మందికి గాయాలయ్యాయి. గాయాలైన సహనా బేగం, ఇరాన్ షాహిష్, హలీమా, మహమ్మద్, నీలాఫర్ (ఆరు నెలలు) జూనెర (నాలుగు నెలలు ) ను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ పి.వెంకట్‌రెడ్డి, సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై రంజిత్‌రెడ్డి సందర్శించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

ఇవి కూడా చదవండి: