Published On:

Sundeep Kishan: సందీప్ కిషన్ తో విజయ్ వారసుడి ఎంట్రీ.. వీడియో వైరల్

Sundeep Kishan: సందీప్ కిషన్ తో విజయ్ వారసుడి ఎంట్రీ.. వీడియో వైరల్

Sundeep Kishan: టాలెంట్ ఉన్నా.. సక్సెస్ అందని హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరో అవ్వడానికి సందీప్ కష్టపడుతున్నాడు. తెలుగు ఇండస్ట్రీ సందీప్ టాలెంట్ గుర్తించకపోయినా తమిళ్ తంబీలు అతని టాలెంట్ ను గుర్తించారు. ప్రస్తుతం సందీప్ ఎక్కువగా తమిళ్ సినిమాలే చేస్తున్నాడు.

 

రాయన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక అదే గుర్తింపుతో తమిళ్ లో హీరోగా ఒక సినిమాను పట్టలెక్కించాడు సందీప్ కిషన్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వారసుడు జాసన్ సంజయ్ ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఎదురుచూపులకు సమాధానం దొరికింది.

 

జాసన్ సంజయ్ ఎంట్రీ ఖరారు అయ్యింది. అయితే ఈ కుర్రాడు హీరోగా కాకుండా డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక జాసన్ – సందీప్ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. నేడు సందీప్ కిషన్ బర్త్ డే కావడంతో ఈ సినిమా మేకింగ్ వీడియోను షేర్ చేస్తూ తమ హీరోకి బర్త్ డే విషెస్ తెలిపారు.

 

ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకింగ్ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో విజయ్ వారసుడు డైరెక్టర్ గా హిట్ ను అందుకుంటాడా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.