Ketika Sharma: అదిదా సర్‌ప్రైజ్ వివాదంపై కేతిక రియాక్షన్ – ఏమన్నదంటే..!

Ketika Sharma Reacts on Adhidha Surprisu Controversy: హీరోయిన్ కేతిక శర్మ ప్రస్తుతం సింగిల్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో కేతిక వరుస ఇంటర్య్వూలు ఇస్తోంది. ఈ నేపత్యంలో తాజాగా నిర్వహించిన సింగిల్ మూవీ ప్రమోషనల్ ప్రెస్‌మీట్ ఆమెకు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగ రాబిన్ హుడ్ అదితా సర్‌ప్రైజ్ వివాదంపై ఆమె తొలిసారి స్పందించింది. తాజాగా ప్రెస్‌మీట్ పాల్గొన్న ఆమె.. కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నానని చెప్పింది.
హిట్స్, ప్లాప్స్ నమ చేతిలో ఉండవు.. నటిగా సినిమాలు చేయడం మాత్రమే నా చేతిలో ఉంటుందన్నారు. ఇండస్ట్రీలో కొనసాగడం లక్‌గా భావిస్తున్నానని చెప్పింది. అల్లు అరవింద్ గారి సమర్పణలో చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను, అది సింగిల్ సినిమాతో కుదిరినందుకు చాలా సంతోషంగా ఉంది. ‘ఇందులో నా పాత్ర పేరు అపూర్వ. స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా నటించాను. కథ బాగా నచ్చడంతో ఈ సినిమా ఓకే చేశారు. డైరెక్టర్ స్క్రిప్ట్ చెబుతున్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నాను. మూవీలో లవ్‌స్టోరీ, వినోదాత్మకంగా, ఆసక్తికరంగా ఉంటుంది. కామెడీ చేయడం చాలా కష్టం, అందులో ఇంటర్వేల్ సీక్వెన్ష్ నాకు చాలా సవాలుగా అనిపించాయి’ అని చెప్పుకొచ్చింది.
అనంతరం అదిదా సర్‌ప్రైజ్ సాంగ్ కాంట్రవర్సీపై స్పందించింది. “అందులో మాదేం ఉండదు. సెట్స్‌లో దర్శకులు ఏది చెబితే అది చేస్తాను. అలాగే అదిదా సర్‌ప్రైజ్ పాట చేశాను. కానీ, సాంగ్‌లోని డ్యాన్స్ మూమేంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భవిష్యత్‌లో అలాంటి మూమెంట్స్‌పై జాగ్రత్తలు తీసుకుంటతా. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషలో ఓ సినిమా చేస్తున్నాను” అని పేర్కొంది. శ్రీ విష్ణు హీరోగా కేతిక శర్మ, లవ్‌టుడే ఫేం ఇవానాలు హీరోయిన్లుగా నటించిన చిత్రం సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరిలు నిర్మించారు. మే 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.