Nayanthara: మెగాస్టార్ అయితే తగ్గాలా.. డిమాండ్ చేసినంత ఇస్తేనే సినిమా.. ?

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడితో ఎంత టాలెంట్ ఉందో.. అంతకు మించిన యాటిట్యూడ్ గా ఉంటుంది. అది ఆమె ఆత్మవిశ్వాసం అని చెప్తుంది. సినిమా కథ చెప్పేటప్పుడే కొన్ని షరతులు పెడుతుంది నయన్. వాటికి అంగీకరిస్తేనే సినిమా చేస్తుంది. లేదంటే లేదు.
హీరోయిన్ గా, నిర్మాతగా బిజీగా మారిన నయన్.. బాలీవుడ్ లో జవాన్ సినిమా తరువాత రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసింది. ఒక స్టార్ హీరో తీసుకుంటున్న పారితోషికం తీసుకుంటుంది. నిర్మాతలు సైతం నయన్ మార్కెట్ ను అర్ధం చేసుకొని.. ఆమె ఎంత అంటే అంత ఇస్తున్నారు. ఎంత స్టార్ హీరో సినిమా అయినా పారితోషికం విషయంలో అస్సలు తగ్గేదేలేదు అని అంటుందట నయన్.
ప్రస్తుతం నయన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక తెలుగులో ఆమె.. మెగా 157 లో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి.. రేంజ్ మారిపోయింది. వెంకీ తరువాత మెగా 157తో చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ చిత్రం కోసం నయన్ భారీగా డిమాండ్ చేస్తుందని టాక్ నడుస్తోంది.
మెగాస్టార్ సినిమా అంటే.. చాలామంది హీరోయిన్స్ ఫ్రీ గా చేసేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే.. తమ కెరీర్ లో ఒక్కసారైనా మెగాస్టార్ తో పని చేయాలనుకొనే డ్రీమ్ ప్రతి హీరోయిన్ కి ఉంటుంది. ఇక చిరు సరసన ఆఫర్ వస్తే.. పారితోషికాలతో పని లేకుండా ఓకే చెప్పే హీరోయిన్స్ ఉన్న ఇండస్ట్రీలో.. మెగాస్టార్ అయినా కూడా నేను చెప్పిన రెమ్యూనరేషన్ ఇస్తేనే నటిస్తాను అని నయన్ చెప్పడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
మెగా 157 కోసం నయన్ అక్షరాలా రూ. 18 కోట్లు డిమాండ్ చేసిందంట. ఆమె రేటు చూసి మేకర్స్ నోర్లు తెరిచినా.. చిరు సినిమా కావడం, అనిల్, నయన్ కావాలి అని చెప్పడంతో ఓకే చేసినట్లు సమాచారం. అయితే ఇన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆమె ప్రమోషన్స్ కి రాను అని చెప్పేస్తుందంట. మరి నయన్ వలన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.