Home / crime
Six people died due to lightning strike : ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం ఆరుగురు అన్నదాతలను పొట్టనబెట్టుకుంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో విత్తనాలు వేసేందుకు సిద్ధమైన రైతన్నల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఏజెన్సీలోని గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో 14 మంది రైతులు వ్యవసాయ కూలీలతో కలిసి మొక్కజొన్న విత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం నుంచి రక్షణ కోసం పొలంలో ఉన్న కర్రలతో […]
Kenya Accident : కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఖతర్‌లో నివాసం ఉంటున్న ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు. విషయాన్ని ఖతర్‌లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. 28 మంది ప్రవాస భారతీయులు కెన్యా పర్యటన.. ఖతర్‌లో నివాసం ఉంటున్న 28 మంది ప్రవాస భారతీయులు కెన్యా పర్యటనకు వెళ్లారు. బస్సులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. తమకు అందిన సమాచారం ప్రకారం.. ఐదుగురు మృతిచెందారు. హెచ్‌సీఐ నైరోబికి చెందిన అధికారులు […]
Vienna : ఆస్ట్రియాలోని గ్రాజ్ సిటీలో ఉన్న లెండ్ ప్రాంతంలోని పాఠశాలలో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. షూటింగ్ ఘటనకు దీటుటా పోలీసులు స్పందిస్తున్నారు. షూటింగ్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. కాల్పుల్లో అనేక మంది గాయపడ్డారు. ఇందులో విద్యార్థులు, టీచర్లు ఉన్నట్లు తెలిసింది. ఓ వీధిలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ ప్రాంతంలో సెకండరీ పాఠశాల ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు కాల్పుల ఘటనపై […]
Fire accident in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ద్వారకా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ద్వారకా సెక్టార్-13లోని శపథ సొసైటీలో మంగళవారం ఉదయం 9:58 గంటల సమయంలో ఘటన జరిగింది. అపార్ట్మెంట్లోని 8,9 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన నివాసితులు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి కిందకు దూకేశారు. […]
Jayashankar Bhupalpally District : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీలో శనివారం గల్లంతైన ఆరుగురి మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. రక్షిత్ (13), సాగర్ (16), మధుసూదన్ (18), రాంచరణ్ (17), శివ మనోజ్ (15), రాహుల్ (19) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుభకార్యానికి వెళ్లి.. మహదేవ్పూర్ మండలం అంబట్పల్లికి చెందిన గొలుకొండ మల్లయ్య ఇంట్లో రెండు రోజు క్రితం పెళ్లి జరిగింది. శుభకార్యానికి హాజరైన బంధువుల్లో […]
Seven pilgrims dead : ఓ లారీ అదుపుతప్పి ఆటోపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాస్తున్న ఏడుగురు యాత్రికులు మృతిచెందారు. మరొకరు తీవ్ర గాయలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఘటన జరిగింది. ఎనిమిది మంది యాత్రికులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. గంగానదిలో పవిత్ర స్నానమాచరించారు. ఆటోలో తిరిగి వెళ్తుండగా ప్రమాదం బారినపడ్డారు. ఈ రోజు తెల్లవారుజామున జాతీయ రహదారి 30లోని సోహాగి లోయ వద్ద లారీ అదుపుతప్పింది. యాత్రికులు ప్రయాణించిన ఆటోపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో […]
Constable dies in Road Accident: పెట్రోలింగ్ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో పోలీసు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద జరిగింది. శనివారం అర్ధరాత్రి షాపూర్ హైవేపై ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు మార్గంలో వెళ్లున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వేగంగా దూసుకొచ్చిన లారీ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. వాహనం వద్ద ఉన్న విజయ్ కుమార్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. […]
TDP Members Murdered in Palnadu District: పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ వర్గీయులు దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని కారుతో ప్రత్యర్థులు ఢీకొట్టారు. కిందపడిన వారిని గొడ్డళ్లతో ప్రత్యర్థులు నరికి చంపారు. మృతులు గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులుగా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. రాజకీయ కక్షలే హత్యలకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ […]
Groom Died with Current Shock: రిసెప్షన్ కాసేపట్లో ఉండగా ఓ పెళ్లికుమారుడు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఈ మరణ వార్త తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్ర దిగ్భ్రాంతులకు గురయ్యాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బయ్యారం సింగిల్ విండో చైర్మన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ […]
Vizianagaram : విజయనగరం కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసింది. కారు డోర్‌కు లాక్ పడటంతో అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన చిన్నారుల తల్లిదండ్రులు ఎంత వెతికినా వారు కనిపించలేదు. చివరకు స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు చిన్నారుల మృతదేహాలు […]