Home / Road Accident
Road Accident in Hyderabad: హైదరాాబాద్‌లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అడిషనల్ డీసీపీ దుర్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లక్ష్మారెడ్డి పాలెం మైత్రి కుటీర్‌లో నివాసం ఉంటున్న అడిషనల్ డీసీపీ బాబ్జి తెల్లవారుజామున వాకింగ్ వెళ్లారు. ఈ సమయంలో ఆయన రోడ్డు దాటుతుండగా.. విజయవాడ జాతీయ రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ […]
Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సారవకోట మండలం కురిడింగి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరుగగా, ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు కారు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్ (56), భార్య వాణి(45) మృతిచెందారు. కుమారుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో […]
Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఓవర్టేక్ చేసే క్రమంలో కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. లావేరు మండలం బుడుమూరు దగ్గర హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామస్తులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]
Massive Road Accident in Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో తెల్లవారుజామున రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వివరాల ప్రకారం.. మంగళవారం వేకువజామున సుమారు 3.30 నిమిషాలకు రెండు […]
Four killed, 20 injured Bus Hits Cement Lorry in Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా చోదిమెళ్లలో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ బస్సు ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన […]
Road Accident Ananthapur Distict : పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తగారింటికి వెళ్తుండగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను, వారి సంతానాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. అనంతరం జిల్లా మండలం కమ్మూరు వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు, మూడు నెలల కూతురుతో సహా మొత్తం నలుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. రాయంపల్లికి చెందిన సరస్వతీ తన అక్కా […]
JMM MP Mahua Maji injured while returning from Maha Kumbh: ఝార్ఖండ్ రాజ్యసభ ఎంపీ మహువా మాజీ ప్రమాదానికి గురయ్యారు. కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా బుధవారం తెల్లవారుజామున ఎంపీ మహువా మాజీకి చెందిన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఝార్ఖండ్ రాజ్యసభ ఎంపీ మహువా మాజీ కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లారు. ఆమె కుమారుడు, కోడలితో కలిసి కారులో […]
Telangana pilgrims die in uttar pradesh road accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్ వద్ద జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా.. వారణాసి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఇంకా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి, ఆయన భార్య విలాసిని, కార్ డ్రైవర్ మల్లారెడ్డి మృతి చెందారు. వీరంతా కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం […]
Sourav Ganguly escapes unharmed after car accident on Durgapur Expressway: ప్రముఖ భారత క్రికెటర్ సౌరవ్ గంగూలీ కారు ప్రమాదానికి గురైంది. గంగూలీ కాన్వాయ్‌లోని 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం తర్వాత 10 నిమిషాల పాటు రోడ్డుపైనే సౌరవ్ గంగూలీ వేచి ఉన్నారు. ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెస్ట్ బెంగాల్‌లోని ఓ యూనివర్సిటీ పంక్షన్ కోసం వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దుర్గాపూర్ జాతీయ […]
Road Accident at Guntur District Three Womens Dead: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం కూలీలను తీసుకెళ్తున్న ఆటోను గుంటూరు జిల్లాలోని నారాకోడూరు-బుడంపాడు గ్రామాల వద్ద ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో మహిళను గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా చేబ్రోలు […]