kantara: Chapter 1: కాంతార చాప్టర్ 1లో అపశ్రుతి – ఆర్టిస్ట్ దుర్మరణం

Kantara Chapter 1 Artist Died: ప్రాంతీయ చిత్రంగా వచ్చిన పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన మూవీ ‘కాంతార’. 2022లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లతో దుమ్మురేపింది. మొదట కన్నడలో రిలీజైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగు రిలీజ్ అవ్వగా అద్భుతైన రెస్పాన్స్ అందుకుంది. దీంతో హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ చేశారు. అన్ని భాషల్లోనూ విశేష ఆదరణ అందుకు ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. పాన్ ఇండియా హిట్ కొట్టి బాక్సాఫీసు రికార్డుకు ఎక్కింది.
దీంతో ఈ సినిమా ప్రీక్వెల్ తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. కాంతార: చాప్టర్ వన్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్ర్తసుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఎప్పుడో సెట్స్‌పై వచ్చింది. కానీ ఈ ప్రీక్వెల్‌కి మొదటి నుంచి అడ్డంకులే ఎదురువుతున్నాయి. తరచూ సెట్‌లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు కాంతార: చాప్టర్ 1 సెట్‌లో ప్రమాదాలు జరిగాయి. ఇటీవల కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన సంఘటనలో కొందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత గాలి వానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ పూర్తిగా ధ్వంసమైంది.
తాజాగా ఈ కాంతార: చాప్టర్ 1లో నటిస్తున్న ఓ ఆర్టిస్టు మృతి చెందారు. సినిమాలో నటిస్తున్న కేరళ చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయాడు. ఉడిపి జిల్లా బైందూర్‌లోని కొల్లూరులో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ షూటింగ్ బైందూర్‌లోని కొల్లూరులో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌లో కేరళకు చెందిన నటుడు కపిల్ పాల్గొన్నాడు. మంగళవారం ఉదయం చిత్రీకరణ పూర్తవ్వడంతో దగ్గర్లోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. లోతు ఎక్కువగా ఉండటంతో అతడు నీటిలో మునిగి చపోయాడు. దీంతో కాంతార ప్రీక్వెల్ సెట్‌లో విషాదం నెలకొంది.
ఇలా కాంతార ప్రీక్వెల్‌కి వరుస అడ్డంకులు వస్తుండటంతో ఆడియన్స్‌ని, మూవీ టీంని ఆందోళనకు గురి చేస్తోంది. మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాకు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. వరుస ప్రమాదాలు జరగడం, తాజాగా మూవీ ఆర్టిస్ట్ చనిపోవడం మూవీ టీం కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ మూవీ నటుడు, దర్శకుడు రిషభ్ శెట్టిని కొన్ని రోజులు క్రితం పంజుర్లీ దేవర హెచ్చరించిందని తెలుస్తోంది. నువ్వు ప్రమాదంలో ఉన్నావని, నీ చూట్టుప్క వాళ్ల దగ్గరనుంచే ఇది పొంచి ఉందని పేర్కొంది. ఇప్పుడ తాజా ఘటన అసలు కాంతార ప్రీక్వెల్‌కి ఏమౌతుందో అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.