Published On:

Revanth Reddy : తెలంగాణలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలి.. ముఖ్యమంత్రి రేవంత్‌‌కు రాహుల్ గాంధీ లేఖ

Revanth Reddy : తెలంగాణలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలి.. ముఖ్యమంత్రి రేవంత్‌‌కు రాహుల్ గాంధీ లేఖ

Revanth Reddy : తెలంగాణలో ‘రోహిత్ వేముల’ చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ, దర్శన్ సోలంకి లాంటి మంచి భవిష్యత్ ఉన్న యువకులు మధ్యలోనే తమ జీవితాలను ముగించారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో యువత హత్యలను ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాలని రేవంత్‌రెడ్డిని రాహుల్ లేఖలో కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతోపాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు కొత్త చట్టాన్ని రూపొందించాలని సూచించారు.

 

ఎక్స్ వేదికగా లేఖ విడుదల..
సోమవారం ఎక్స్ వేదికగా రాహుల్‌ లేఖను విడుదల చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ‘రోహిత్ వేముల చట్టం’ అమలు చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. రోహిత్ వేముల చట్టంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ ‌రెడ్డి స్పందించారు. రాహుల్ ఏం ఆలోచించినా ప్రజల కోసమే ఆలోచిస్తారని తెలిపారు. రోహిత్ చట్టంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016లో హెచ్‌సీయూలో చ‌దువుతున్న రోహిత్ వేముల కుల వివ‌క్ష కారణంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

 

 

 

 

ఇవి కూడా చదవండి: