Published On:

Hydra: నేడు హ్రైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభిచనున్న సీఎం రేంవంత్

Hydra: నేడు హ్రైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభిచనున్న సీఎం రేంవంత్

Hydra: ఈరోజు సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. మిగతా స్టేషన్లతో సంబంధం లేకుండా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేసి ఆక్రమణలకు పాల్పడేవారిపై హైడ్రా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. హైదరాబాద్‌లో కబ్జారాయుళ్లను కటకటాల వెనక్కి నెట్టేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసింది.

 

బుద్ధభవన్ సమీపంలోని రెండతస్తుల్లో హైడ్రా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసింది. హైడ్రా పోలీస్ స్టేషన్‌ లో ఏసీపీ, ఆరుగురు ఇన్ స్పెక్టర్లు, 12 మంది ఎస్సైలు, 30 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. హైడ్రా పోలీస్ స్టేషన్ కార్యకలాపాల కోసం ఇప్పటికే సిబ్బంది నియామకం పూర్తైంది.

హైడ్రా పరిధి ఓఆర్​ఆర్​ వరకు విస్తరించి ఉండటంతో ఆ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను హైడ్రా పోలీస్ స్టేషన్ పరిశీలించనుంది. మిగతా పోలీస్‌స్టేషన్లతో సంబంధం లేకుండా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేయనున్నారు.

 

భూకబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్న వారితో పాటు చెరువుల్లో మట్టిపోసి కబ్జాచేయడం, నాలాలు ఆక్రమించడం సహా తప్పుడు పత్రాలతో భూమి ఆక్రమించుకోవడం, రహదారులకి అడ్డంగా నిర్మాణాలు చేపట్టడం వంటి వాటిపై దృష్టి సారించనున్నారు.

ఇవి కూడా చదవండి: