Published On:

Horoscope for Thursday, May 08, 2025: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అవసరానికి డబ్బు చేతికి అందుతుంది!

Horoscope for Thursday, May 08, 2025: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అవసరానికి డబ్బు చేతికి అందుతుంది!

Horoscope for Thursday, May 08, 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం: ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో పురోగతి పొందుతారు. వ్యాపారంలో లాభాలు వరిస్తాయి. మానసికంగా ధైర్యాన్ని పొందుతారు. కొత్త ఉత్తేజం కలిగి ఉంటారు. దైవ చింతన ఉంటే మంచిది.

వృషభం: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. కీలక పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.

మిథునం: ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. కీలకమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. దైవ చింతన మంచిది.

 

కర్కాటకం: ఈ రాశి వారికి శుభప్రదం. చేసిన పనికి తగిన గుర్తింపు ఉంటుంది. ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండం మంచిది.

సింహం: ఈ రాశి వారికి అనకూలం. పెండిండ్ పనులలో కదలిక ఏర్పడుతుంది. ఊహించని అవకాశాలు వస్తాయి. సమయానుకూలంగా ఉండాలి.. ఉద్యోగులు ఉన్నతాధికారులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్టదేవతారధన మంచిది.

కన్య: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. పరపతిని పెంచుకోవడానికి చేసే పనులు సక్సెస్ కావొచ్చు. అనుకున్న పనుల్లో విజయం పొందుతారు. పెట్టుబడులకు లాభాలు వస్తాయి.

 

తుల: ఈ రాశి వారికి అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో అనుకున్న ఫలితాలు వస్తాయి. ఉన్నత అధికారుల నుంచి అండదండలు ఉంటాయి. ప్రసంగాలు, చర్చలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

వృశ్చికం: ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ సంతోషంగా ఉండరు. ఆలయాల సందర్శనం మంచిది. వ్యాపారులకు అనుకూలం. సమయస్ఫూర్తితో నిర్ణయాలు కలిసి వస్తాయి. దైవచింతన అలవాటు చేసుకోవాలి.

ధనస్సు: ఈ రాశి వారికి అనుకూలం. ఉద్యోగులకు అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు లాభాలు వరిస్తాయి. వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలి.

 

మకరం: ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త ఆలోచనలతో అభివృద్ధి జరుగుతుంది. ఛాలెంజింగ్ పనులు మొదలు పెడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు లాభాలు అందుకుంటారు.

కుంభం: ఈ రాశి వారికి కలిసి వస్తుంది. రుణాలను కొంతవరకు తీరుస్తారు. వృత్తి, ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఉంటుంది. బిజినెస్ కు సంబంధించి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దైవదర్శన మంచిది.

మీనం: ఈ రాశి వారికి అనుకూలం. వృత్తి ఉద్యోగ, వ్యాపారులకు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కీలక పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. సాయిబాబాను పూజించాలి.