Published On:

Poco M7 5G: జోరుగా ఆఫర్లు.. పోకో 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. మరి ఇంత తక్కువ..!

Poco M7 5G: జోరుగా ఆఫర్లు.. పోకో 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. మరి ఇంత తక్కువ..!

Poco M7 5G: ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌ 5G మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.10,000 లోపు ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. ధర తక్కువగా ఉందని ఫీచర్లు లేదా పనితీరుపై రాజీ పడాల్సిన అవసరం లేదు. Poco M7 5Gని భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉంది. పెద్ద డిస్‌ప్లేతో పాటు, శక్తివంతమైన బ్యాటరీ కూడా ఉంది.

 

5G విభాగంలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 5G ప్రాసెసర్‌, 5000mAh కంటే పెద్ద బ్యాటరీతో వస్తున్న ఏకైక ఫోన్ Poco M7. ఈ స్మార్ట్‌ఫోన్ అధిక-రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP కెమెరా సెటప్‌ కూడా అందించారు. ఈ ఫోన్ ఇప్పటికే డిస్కౌంట్‌ ప్రకటించగా.. ఇప్పుడు దీని ధర మరింత తగ్గింది.

 

Poco M7 5G Offer
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9,499 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర ఇది. దీనిపై బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ప్రయోజనాలు విడిగా అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లింపుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు.

 

Poco M7 5G Exchange Offers
మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునే వారు దాని మోడల్, కండిషన్‌ను బట్టి గరిష్టంగా రూ. 6,450 వరకు తగ్గింపు పొందచ్చు. ఈ ఫోన్ శాటిన్ బ్లాక్, ఓషన్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

 

Poco M7 5G Specifications
పోకో ఫోన్ 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. 6GB లేదా 8GB ర్యామ్ ఉంటుంది. 128జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ సహాయంతో విస్తరించవచ్చు.

 

ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా,యు 2MP సెకండరీ సెన్సార్‌ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,160mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. బాక్స్‌లో 33W ఛార్జర్ అందిచారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా HyperOS పై నడుస్తుంది.యు IP52 రేటింగ్‌తో దుమ్ము, స్ప్లాష్ నిరోధకతతో వస్తుంది.