Home / CM Revanth Reddy
తెలంగాణలో పంట రుణాల మాఫీని మూడు విడతల్లో ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు. బుధవారం ప్రజాభవన్‌లో జరిగిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీకి, రేషన్ కార్డుకు లింక్ పెట్టొద్దన్నారు. తెలంగాణలో ప్రతిఒక్కరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందాలని ఈ మేరకు సూచించారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసారు. టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టు సభ్యుడయిన సిరాజ్‌ను రేవంత్‌రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు.
దీర్ఘ కాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఇవాళ భేటీ కాబోతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలత కూడిన వినతిపత్రాన్ని సమర్పించి తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రధానిని కోరారు.
హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 65 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఐటీఐ)లను అత్యాధునిక శిక్షణా సంస్థలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) - 2024 ఫలితాలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రకటించారు. ఈ పరీక్షకు 2,86,381 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.