Last Updated:

Nagarjuna Sagar: సాగర్ కు కొనసాగుతున్న వరద ఉద్ధృతి.. 8 గేట్లు ఎత్తివేత

గత నాలుగు రోజులుగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కురుస్తు వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. కాగా ఈ వానల దాటికి చెరువులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది.

Nagarjuna Sagar: సాగర్ కు కొనసాగుతున్న వరద ఉద్ధృతి.. 8 గేట్లు ఎత్తివేత

Nagarjuna Sagar: గత నాలుగు రోజులుగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కురుస్తు వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. కాగా ఈ వానల దాటికి చెరువులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది.

సాగర్ 8 గేట్లు ఎత్తివేత..

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తు భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దాదాపు ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. నాగార్జున సాగర్‌కు 1.18 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వచ్చి చేరుతోంది. వరద నీటి ఉద్ధృతి వల్ల ప్రాజెక్టులోని నీటిని 8 గేట్ల ఎత్తడం ద్వారా విడుదల చేస్తున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం..

రాగల 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దానితో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొనింది. ఇప్పటికే ఈనెల 8, 9, 10 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి: