KCR: పాస్‌పోర్టు ఆఫీస్‌కు మాజీ సీఎం కేసీఆర్.. ఎందుకంటే?

KCR Visits Passport Office for Renewal: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్‌లో ఉన్న పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చారు. ఈ మేరకు ఆయన పాస్‌పోర్టు కార్యాలయంలో తన పాస్‌పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు. కాగా, డిప్లమాటిక్ పాస్‌పోర్టు స్థానంలో సాధారణ పాస్‌పోర్టుల తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి తన కాన్వాయ్‌లో కేసీఆర్ పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చారు. ఈ మేరకు తన పనిని పూర్తి చేసుకొని నేరుగా తెలంగాణ భవన్‌కు బయలుదేరారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. పార్టీ ఆవర్భవించి 25 అవుతున్నందున సిల్వర్ జూబ్లీ నిర్వహణతో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్ధేశం చేయనున్నారు.
కాగా, దాదాపు 7 నెలల తర్వాత కేసీఆర్ బయటకు రావడంతో బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడతున్న విధానాలపై విమర్శించే అవకాశం ఉంది. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమలులో విఫలమవుతోంది. ఈ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడికి గురిచేసే అవకాశం ఉంది. ఇందులోభాగంగానే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అంతకుముందు, పాస్‌పోర్టు కార్యాలయంలో అధికారులు మాజీ సీఎంకు ఘన స్వాగతం పలికారు.