Home / BRS Party
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సభలో ఇవాళ అపశ్రుతి చోటుచేసుకుంది. కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో భాగంగా కాన్వాయ్‌లో వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మహిళా కానిస్టేబుల్ పద్మజను పార్టీ కార్యకర్త శ్రీకాంత్ బైక్ ఢీకొట్టింది. దీంతో ఆమెకు కాలు విరిగింది. పార్టీ కార్యకర్తలు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేటీఆర్ ఆరా తీశారు. మహిళా కానిస్టేబుల్ పద్మజకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు. తెలంగాణ అన్నిరంగాల్లో వెనకబాటు.. సీఎం […]
Gaddam Prasad Kumar : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించేదిగా ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ మంత్రి కోమటిరెడ్డి రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ప్రశ్నపై […]
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ శనివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఒంటరిగానే గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయని, అధికారం కోసం కొందరు కండువాలు మార్చడం పరిపాటిగా మారిందని పరోక్షంగా అన్నారు. సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు […]
KTR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ సాధించిన మహా నాయకుడని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఉమ్మడి నల్లగొండలోని సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్‌రెడ్డి జాక్పాట్లో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. బీఆర్ఎస్ కోసం రక్తం ధారపోస్తున్న అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లకు హృదయపూర్వక నమస్కారాలు. ఇది అరుదైన సందర్భం అన్నారు. తెలుగు రాజకీయాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైనదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. […]
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బయట బూతులు మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీలో నిజాలు మాట్లాడుతారు అనుకున్నామని, కానీ బూతులతోపాటు అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే రేవంత్ బూతు పిత అయ్యారని విమర్శించారు. బూతు సినిమాకు పనికొచ్చే స్క్రిప్ట్ లాగా ముఖ్యమంత్రి ఉపన్యాసం ఉందని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ […]
TG Assembly : సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి సమాధానం ఇస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చావును కోరుకున్న నాయకుడి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నామని వాకౌట్కు ముందు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ స్టేచర్‌పై నుంచి మార్చురీకే అని వ్యాఖ్యానించడం, తెలంగాణ సాధకుడు, 10 ఏండ్లు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిన పాలనాధక్షుడు అయిన కేసీఆర్ చావును […]
Dasoju Shravan : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. దీంతో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కనున్నది. ఒక్క స్థానానికి అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గులాబీ పార్టీ నుంచి సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్ పేర్లు ముందు నుంచీ వినిపించాయి. అంచనాల ప్రకారమే శ్రవణ్ పేరును కేసీఆర్ ఖారారు చేసి […]
Harish Rao : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ మైదానంలో శనివారం జరిగిన మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ విపక్షంలో ఉన్నప్పుడు మొదలు పెట్టి అధికారంలోకి వచ్చాక కూడా అబద్ధాలు మాట్లాడటం మానుకోలేదని విమర్శించారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పాలనలో మహిళా సంఘాలకు రూ.21వేల కోట్ల వడ్డీలేని […]
BRS chief KCR : ఈ నెల 12 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 27 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 11వ తేదీన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ నెల 11న మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశంచేయనున్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ […]
KCR Presence in Budget : ఈ నెల 12 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్లో చర్చించి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారనే చర్చ జరుగుతోంది. పార్టీ […]