Home / kcr
CM Revanth Reddy sensational comments Warangal Public Meeting: మాజీ సీఎం కేసీఆర్ ప్రజలతో బాటు వేములవాడ రాజన్ననూ మోసం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన వేములవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా వేములవాడలో రూ.127.65 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. అనంతరం నేతన్నల కోసం రూ.50 కోట్లతో నూలు బ్యాంకును సీఎం ప్రారంభించారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు సీఎం పరిహారం అందించారు. అనంతరం వేములవాడ గుడిచెరువులో నిర్వహించిన […]
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు వైద్యుల సలహా మేరకు గురువారం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పాత ఓమ్నీ వ్యాన్‌ను నడిపారు. కొద్ది నెలల క్రితం కేసీఆర్ బాత్ రూమ్ లో జారిపడి తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే
చత్తీస్గడ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు గులాబీ అధినేతకు నోటీసులు జారీ చేశారు. జులై 30 వరకు ధర్మాసనాన్ని కేసీఆర్ సమయం కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం బయటపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ పాత్రను ఈడీ వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని ఈడీ చెప్తోంది. ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనల సందర్భంగా అధికారులు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించిన ఎన్నికల సంఘం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అవమానకరమైన మరియు అభ్యంతరకరమైన ప్రకటనలు చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు బుధవారం రాత్రి 8 గంటల నుండి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా భారత ఎన్నికల సంఘం నిషేధించింది.
బీఆర్ఎస్, కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలలో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండు లేదా మూడు సీట్లు గెలుచుకోవచ్చని జోస్యం చెప్పారు. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిపాజిట్ కూడా రాదన్నారు.మెదక్‌లో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటూ గెలవదన్నారు.
తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక శక్తి బీఆర్ఎస్ అని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పాలని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అన్నారు.ఈ నెలాఖరు నుంచి వారం రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని ఎంపీలను కేసీఆర్ కోరారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ ఎంపీల సమావేశం జరిగింది.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకి వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ క్యాడర్‌తో తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడారు. ఫిబ్రవరి నెలనుంచి కేసీఆర్ ప్రతిరోజూ తెలంగాణ భవన్‌కి ప్రతిరోజూ వచ్చి కార్యకర్తలని కలుస్తారని హరీష్ రావు తెలిపారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. బేగంపేట విమానాశ్రయం నుంచి నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం జగన్ పరామర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు.
పది రోజుల వరకు తనను కలిసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రజలను కోరారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఇతర రోగులకు అసౌకర్యం కలుగుతుందని అందువలన ఎవరూ తనను పరామర్శించేందుకు రావద్దని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేసారు.