Published On:

Road Accident : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి

Road Accident : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి

Vikarabad district road accident.. three dead : వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు చోటుచేసుకుంది. ఐనన్‌పల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్సై సత్యనారాయణ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కర్ణాటకలోని గనుగాపూర్‌లోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి కారులో వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో చిట్లపల్లి-యాలమద్ది గ్రామాల మధ్య జాతీయ రహదారిపై బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలను కొండగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల కుటుంబాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

 

 

ఇవి కూడా చదవండి: