Last Updated:

Pawan kalyan: త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన సిద్ధంగా లేదు- పవన్ కల్యాణ్

Pawan kalyan: ఏపీలో డిసెంబరులో ఎన్నికలు రావొచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అదే జరిగితే.. జూలై నుంచి ప్రచారం చేస్తానని అన్నారు.

Pawan kalyan: త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన సిద్ధంగా లేదు- పవన్ కల్యాణ్

Pawan kalyan: ఏపీలో డిసెంబరులో ఎన్నికలు రావొచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అదే జరిగితే.. జూలై నుంచి ప్రచారం చేస్తానని అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన డివిజన్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

జనసేన సిద్దంగా లేదు.. (Pawan kalyan)

ఏపీలో డిసెంబరులో ఎన్నికలు రావొచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అదే జరిగితే.. జూలై నుంచి ప్రచారం చేస్తానని అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన డివిజన్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరులో.. జనసేన బలికావడానికి సిద్దంగా లేదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన.. తెదేపా, భాజపా పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ మేరకు కార్యకర్తలను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. సీఎం.. సీఎం అనే కేకలు వేస్తే తాను ముఖ్యమంత్రి కాలేనని అన్నారు.

క్రేన్లతో గజమాలలు వేసే కన్నా.. ఓట్లు వేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు వంద ఓట్లు వేయించగలితే స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఏం చేసినా నిర్మాణాత్మకంగా చేయాలని.. సీఎం అనే పదవి రావాలంటే సముచిత స్థానంలో గెలిపించాలని పవన్ అన్నారు.

రాష్ట్ర భవిష్యత్ కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. జనసేన కార్యకర్తల ఆరోగ్యం కోసం ఏటా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో జనసేన త్రిముఖ పోటీలో బలికావడానికి సిద్దంగా లేదని తెలిపారు. వైకాపా పాలనలో రౌడీయిజం పెరిగిందని అన్నారు.

జగన్ పాలన.. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని పవన్ ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం.. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రాజకీయంలో అనుకూల, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కున్నవారే రాజకీయ నాయకులు అవుతారని అన్నారు.

తెదేపా నాయకులను సీఎం చేసేందుకు జనసేన లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జనసేన, తెదేపా, భాజపా పొత్తు ఉంటుంది.

ఏం చేసినా చెప్పి చేస్తా.. మొదటి అడుగు వైకాపాను గద్దె దించడమే. పొత్తు కచ్చితమనేది ప్రకటించా.. ఇంకా ఆ స్థాయిలో చర్చలు జరగలేదు.

విధివిధానాలు ఇంకా ప్రకటించలేదు. పొత్తుపై కొలిక్కి వచ్చాక ప్రజల మధ్య ఒప్పందం చేసుకుంటామని అన్నారు.